India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది.
భారీ స్కోర్ దిశగా భారత్
రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), మానవ్ సుతార్(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్.. గిల్(100), రిషబ్ పంత్(81), జురెల్(19) వికెట్లు కోల్పోయింది.
పంత్ అవుట్
రిషబ్ పంత్(81) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాహిది బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ధ్రువ్ జురెల్ అవుట్
19 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సలీమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 456-5
భారత్ నాలుగో వికెట్ డౌన్
416 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 126 రన్స్ చేసిన గిల్..సలీమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్ జురెల్ వచ్చాడు.
రెండో రోజు ఆట ఆరంభం
ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో రిషబ్ పంత్(50), శుబ్‌మన్ గిల్(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది.
మొదటి రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్(81) హాఫ్ సెంచరీతో రాణించారు. అఫ్దాన్ బౌలర్లలో సలీమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ
భారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ


