గిల్‌ స్థానంలో కెప్టెన్‌గా పంత్‌..? | Shubman Gill Replacement for India Test vs Afghanistan | Sakshi
Sakshi News home page

గిల్‌ స్థానంలో కెప్టెన్‌గా పంత్‌..?

Apr 21 2026 2:20 PM | Updated on Apr 21 2026 2:28 PM

Shubman Gill Replacement for India Test vs Afghanistan

ఐపీఎల్‌ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ గిల్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్‌ పంత్‌ పేరు ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.

రిషబ్‌ పంత్‌ విషయానికొస్తే.. ‍ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్‌ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్‌లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.

కేఎల్ రాహుల్
భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్‌కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్‌ రాహుల్‌ ఉంటాడు. రాహుల్‌కు గతంలో భారత టెస్ట్‌ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.

గిల్‌కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్‌రౌండర్‌గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement