గంభీర్‌ మాట లెక్కచేయని పంత్‌.. ఆత్రుత‌ ఎందుకు? | Fans Troll-Rishabh Pant Reckless Shot-Miss-Century Vs-AFG Test Match | Sakshi
Sakshi News home page

గంభీర్‌ మాట లెక్కచేయని పంత్‌.. ఆత్రుత‌ ఎందుకు?

Jun 7 2026 12:05 PM | Updated on Jun 7 2026 1:24 PM

Fans Troll-Rishabh Pant Reckless Shot-Miss-Century Vs-AFG Test Match

ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 500 ప‌రుగుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌, గిల్ శ‌త‌కాలు న‌మోదు చేయ‌గా, పంత్ మాత్రం సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 81 ప‌రుగులు చేశాడు. షాహిది వేసిన‌ ఇన్నింగ్స్ 103వ ఓవ‌ర్ నాలుగో బంతిని పంత్ మిడాఫ్ దిశ‌గా భారీ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. 

కానీ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచిన బంతిని ఫీల్డ‌ర్ అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జయ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో త‌న స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో విఫ‌ల‌మైన పంత్ ఆఫ్గన్‌తో టెస్టులో మాత్రం మంచి ఈజ్‌తోనే బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే పంత్ బ్యాటింగ్ దిగ‌డానికి ముందు హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ డిఫెన్స్‌మోడ్‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తూ బ్యాటింగ్ చేయాల‌ని సూచించాడు. 

కానీ క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న శైలికి తగినట్లు ఫాస్ట్‌గా ఆడేందుకే పంత్‌ ప్రాధాన్యమిచ్చాడు. అయితే సెంచ‌రీకి చేరువవుతున్న క్ర‌మంలో కాస్త త‌గ్గి ఆడుంటే బాగుండేది. భారీ షాట్ ఆడాల‌నే ఆత్రుత‌తో బంతిని బ‌లంగా బాదిన‌ప్ప‌టికీ టైమింగ్ కుద‌ర‌క నిర్ల‌క్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

‘కోచ్ గంభీర్ మాట లెక్క‌చేయ‌కుండా ఆడావు.. మూల్యం చెల్లించుకున్నావు’.. ‘పంత్ నువ్వు మార‌వా.. అంత నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు’.. ‘నిర్ల‌క్ష్యం పంత్ కొంప‌ముంచింది’.. ‘తొందరెందుకు పంత్‌.. కాస్త ఓపిక వ‌హిస్తే సెంచ‌రీ అయ్యేదిగా’ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే సెంచరీ మిస్‌ అయినప్పటికీ పంత్‌ ఒక అరుదైన ఫీట్‌ సాధించాడు. ఆఫ్గన్‌తో టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ నిలిచాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే రెండో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి టీమిండియా 110 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 475 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (14), మాన‌వ్ సుతార్ (9) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 500 ప‌రుగల మార్క్ చేరిన త‌ర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవ‌కాశ‌ముంది. ఆఫ్గ‌న్ బౌల‌ర్లలో మొహమ్మ‌ద్ స‌లీమ్ నాలుగు వికెట్లు తీయ‌గా, జిహుర్ రెహ్మాన్‌, హ‌ష్మ‌తుల్లా చెరొక వికెట్ తీశారు.

చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయ‌స్ అయ్య‌ర్‌ తొలి స్పంద‌న‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement