ఆఫ్ఘన్‌ సిరీస్‌కు విరాట్‌ ప్రత్యామ్నాయం ఇతడే..! | Virat Kohli Replacement Announced In India ODI Squad Vs Afghanistan | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్‌ సిరీస్‌కు విరాట్‌ ప్రత్యామ్నాయం ఇతడే..!

Jun 4 2026 4:28 PM | Updated on Jun 4 2026 4:36 PM

Virat Kohli Replacement Announced In India ODI Squad Vs Afghanistan

త్వరలో (జూన్‌ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026లో హ్యామ్‌ స్ట్రింగ్‌ గాయానికి గురయ్యాడు. 

ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌ సిరీస్‌కు విరాట్‌ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్‌ చేసిందని సమాచారం. విరాట్‌ రీప్లేస్‌మెంట్‌ కోసం తిలక్‌ వర్మ, దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.

ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్‌.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్‌, పడిక్కల్‌, పాటిదార్‌ను కాదని రుతురాజ్‌వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement