ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్‌మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే
👉అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్‌గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న ఓపెనర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
👉ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.
👉అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్‌లో ఓపెనర్‌గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.
👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్.. అమర్‌నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర


