టీమిండియా తరపున మరో యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. భారత టెస్ట్ క్యాప్‌ను అందుకున్న 319వ ప్లేయర్‌గా సుతార్ నిలిచాడు.
వాస్తవానికి హర్ష్ దూబేకు తుది జట్టులో ఆడే అవకాశముస్తుందని అంతా భావించారు. కానీ మేనెజ్‌మెంట్ మాత్రం సుతార్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవరి మానవ్ సుతార్ నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.
ఎవరీ మానవ్ సుతార్?
అతడి పూర్తి పేరు.. మానవ్ జగదుసకుమార్ సుతార్. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆగస్టు 3, 2002న రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్‌లో జన్మించాడు. తన చిన్నతనం క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమించాడు. మానవ్ శ్రీ గంగానగర్ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి అండర్-14, అండర్-16 టైటిళ్లను అందించాడు.
ఆ తర్వాత అతడు రాజస్తాన్ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అక్కడ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో రాజస్తాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం మానవ్‌కు లభించింది. 2022 రంజీ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌పై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర రంజీ సీజన్‌లోనే సుతార్ దుమ్ములేపాడు.
తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. కేవలం 6 మ్యాచ్‌లలోనే 39 వికెట్లు పడగొట్టి రాజస్తాన్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తొలి 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అతడు ఏకంగా 44 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన సుతార్.. 2.94 ఏకానమీ రేట్‌తో 129 వికెట్లు సాధించాడు.
ఇందులో ఆరు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. 8/33 అతడి అత్యుత్తమ గణాంకాలగా ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌కు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. అతడి పేరిట ఓ ఫస్ట్‌క్లాస్ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగానే అతడిని జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్యాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియా-ఎ తరపున కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు తన అరంగేట్ర మ్యాచ్‌లో సీనియర్ జట్టు తరపున ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా 12 ఏళ్ల తర్వాత రాజస్తాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్‌గా సుతార్ నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ


