మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ | Vaibhav Sooryavanshi Angrily Scolds Fan | Sakshi
Sakshi News home page

మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Jun 6 2026 11:43 AM | Updated on Jun 6 2026 11:52 AM

Vaibhav Sooryavanshi Angrily Scolds Fan

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో మెరుపులు మెరిపించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఇప్పుడు  భారత్-ఎ జట్టు త‌ర‌పున స‌త్తాచాటేందుకు సిద్ద‌మ‌య్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణ‌పు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.

ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్య‌వంశీకి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెట‌ర్ త‌న ల‌గేజ్‌తో పాటు బ‌స్సు వైపు వెళ్తుండ‌గా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. 

దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్‌లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. 

ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement