రెండో వ‌న్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భార‌త్ సొంతం | India bag series in Lucknow after centuries from Gill-Kishan | Sakshi
Sakshi News home page

IND vs AFG: రెండో వ‌న్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భార‌త్ సొంతం

Jun 17 2026 9:26 PM | Updated on Jun 17 2026 9:42 PM

India bag series in Lucknow after centuries from Gill-Kishan

లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్‌ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్‌ బ్యాటర్లలో రెహమత్‌ షా(79) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్‌(41), అటల్‌(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌ తలా మూడు వికెట్లు సాధించారు.

వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్‌ అయింది. శుబ్‌మన్‌ గిల్‌ (154), ఇషాన్‌ కిషన్‌ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 20న చెన్నై వేదికగా జరగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement