రోహిత్‌, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్‌! | Rohit Sharma-Hardik Pandya-Fitness Status Revealed India Vs Afghanistan ODI | Sakshi
Sakshi News home page

ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌.. రోహిత్‌, పాండ్యా ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్‌!

Jun 9 2026 11:28 AM | Updated on Jun 9 2026 11:37 AM

Rohit Sharma-Hardik Pandya-Fitness Status Revealed India Vs Afghanistan ODI

అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్‌ రోహిత్ శ‌ర్మ‌, ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ ల‌భించింది. బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో జ‌రిగిన ప‌లు మ్యాచ్ సిమ్యులేష‌న్ల‌లో పాండ్యా పాల్గొన్నాడ‌ని, ఎక్క‌డా అసౌక‌ర్యంగా క‌నిపించ‌లేద‌ని మెడిక‌ల్ బృందం తెలిపింది. 

అత‌డు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయ‌డంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రగ‌నున్న భార‌త్‌, ఆఫ్గ‌న్‌ తొలి వ‌న్డేలో పాండ్యా ఆడే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ కూడా ఇప్ప‌టికే ఫిట్‌నెస్ నిరూపించు కున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొట‌క్ శుభ‌వార్త చెప్పాడు. 

ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటార‌ని తెలిపాడు. అయితే ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్‌కు సంబంధించి స‌ర్టిఫికెట్‌ను మెడిక‌ల్ సీవోఈ బృందం ఇంకా అందించ‌లేదు. అయితే త‌న‌కు అందిన స‌మాచారం మేర‌కు రోహిత్‌, పాండ్యా ఫిట్‌నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడిక‌ల్ టీమ్ ఇంకా స‌ర్టిఫికెట్లు ఇవ్వలేద‌ని తెలిపాడు. 

అయితే వారి నుంచి ఒక్క‌సారి క్లియ‌రెన్స్ వస్తే మాత్రం రోహిత్‌, పాండ్యాలు ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడ‌తార‌ని స్ప‌ష్టం చేశాడు. కానీ వ‌న్డే సిరీస్‌లో ఈ ఇద్ద‌రూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్‌లు త‌ప్ప‌నిస‌రిగా ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందేన‌ని సితాన్షు కొట‌క్ పేర్కొన్నాడు. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ చాలా మ్యాచ్‌ల‌కు అందుబాటులో లేడు. కండ‌రాల గాయంతో గ్రూప్ ద‌శ‌లో ఐదు మ్యాచ్‌కు దూర‌మ‌వ్వ‌గా, పాండ్యా లీగ్ ఆఖ‌రి ద‌శ‌లో వెన్నునొప్పి కార‌ణంగా చివ‌రి మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత పాండ్యా, రోహిత్ శ‌ర్మ‌లు ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ సాధించేందుకు బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ శిబిరానికి వ‌చ్చారు.

చదవండి: వైభ‌వ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!

Advertisement
 
Advertisement
Advertisement