అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది.
ఆఫ్గన్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్‌లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది.
ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్‌కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా సులువుగానే గెలిచింది.
అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!


