అఫ్గాన్‌తో టెస్ట్‌.. భారత జట్టులోకి కొత్త కుర్రాడు | India vs Afghanistan Test Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs AFG: అఫ్గాన్‌తో టెస్ట్‌.. భారత జట్టులోకి కొత్త కుర్రాడు

Jun 6 2026 9:05 AM | Updated on Jun 6 2026 9:42 AM

India vs Afghanistan Test Live Updates And Highlights

ముల్లాన్‌పూర్ వేదికగా భారత్‌-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో రాజస్తాన్‌ లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుత్తార్‌ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.

అదేవిధంగా సాయిసుదర్శన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు ఛాన్స్‌ ఇచ్చారు.

తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ

భారత్ : కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

 

Advertisement
 
Advertisement
Advertisement