లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 రన్స్ చేసింది.
రోహిత్ శర్మ(138), శుబ్‌మన్ గిల్(77), విరాట్ కోహ్లి వంటి టాపార్డర్ బ్యాటర్లు రాణించినప్పటికి, మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్, జాకబ్ బెతల్, ఆర్చర్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఏకంగా 387 పరుగులు సాధించింది. ఓపెనర్లు బెన్ డకెట్ (141), జేకబ్ బెతెల్ (91) దుమ్ములేపగా.. జో రూట్ (48 బంతుల్లో 74), జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.
ఓటమి దిశగా భారత్
భారత్ వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) వికెట్లను కోల్పోయింది. టీమిండియా విజయానికి 10 బంతుల్లో 47 పరుగులు కావాలి.
విరాట్ కోహ్లి అవుట్
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 28 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజులో రాహుల్, అక్షర్ పటేల్ ఉన్నారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు డౌన్
ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కిషన్.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్(0) డకౌటయ్యాడు. క్రీజులో కోహ్లి(65) ఉన్నారు. భారత విజయానికి 82 పరుగులు కావాలి.
టీమిండియా ట్రిపుల్ సెంచరీ
టీమిండియా స్కోర్ 300 పరుగులు దాటింది. భారత విజయానికి 39 బంతుల్లో ఇంకా 84 పరుగులు కావాలి.
రోహిత్ అవుట్
రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారీ సెంచరీతో సత్తాచాటిన రోహిత్.. బెతల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోర్: 262/2
రోహిత్ సెంచరీ
లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. కేవలం 84 బంతుల్లో తన 34వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 33 ఓవర్లకు భారత్ స్కోర్: 218/1
సెంచరీకి చేరువలో రోహిత్
రోహిత్ శర్మ 92 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 187/1
భారత్ తొలి వికెట్ డౌన్
147 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన కెప్టెన్ శబ్‌మన్ గిల్.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
రోహిత్ హాఫ్ సెంచరీ
రోహిత్ శర్మ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 21 ఓవర్లకు భారత్ స్కోర్: 117/0
ఇరవై ఓవర్లలో భారత్ స్కోరు: 109-0
రోహిత్ 42, గిల్ 65 పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి 279 పరుగులు కావాలి.
సెంచరీ కొట్టిన టీమిండియా
18.3: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రోహిత్ సింగిల్ తీయడంతో.. టీమిండియా వంద పరుగుల మార్కును చేరుకుంది. భారత్ స్కోరు: 103-0 (19). గిల్ 60, రోహిత్ 41 పరుగులతో ఉన్నారు. విజయానికి 285 పరుగులు కావాలి.
గిల్ అర్ధ శతకం
14.3వ ఓవర్: ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి. భారత్ స్కోరు: 89-0 (15). గిల్ 52, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.
14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-0
గిల్ 49, రోహిత్ 36 పరుగులతో ఉన్నారు.
టీమిండియా హాఫ్ సెంచరీ
10.2: సామ్ కరన్ బౌలింగ్‌లో గిల్ సింగిల్ తీయగా.. టీమిండియా యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకుంది. స్కోరు: 60-0(11). రోహిత్ 34, గిల్ 26 పరుగులతో ఉన్నారు.
పవర్ ప్లేలో భారత్ స్కోరు: 49-0 (10)
కట్టుదిట్టమైన బంతులతో పదో ఓవర్‌ను మెయిడెన్ చేసిన టంగ్.
రోహిత్ శర్మ 24, గిల్ 25 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 339 పరుగులు కావాలి.
గేరు మార్చిన రోహిత్
ఎనిమిదో ఓవర్లో జోష్ టంగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. పుల్ షాట్‌తో ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన హిట్‌మ్యాన్. భారత్ స్కోరు: 43-0 (8). రోహిత్ 23, గిల్ 20 పరుగులతో ఉన్నారు.
ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 17-0
రోహిత్ మూడు, గిల్ 14 పరుగులతో ఉన్నారు.
టార్గెట్ 388.. లక్ష్య ఛేదనకు దిగిన భారత్
మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 9-0
ఓపెనర్లు రోహిత్ ఒకటి , గిల్ ఎనిమిది పరుగులతో ఉన్నారు.
ఇంగ్లండ్ భారీ స్కోరు
ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. టీమిండియాకు 388 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కాగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు.
బట్లర్ మెరుపులు
49 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 371-3
బట్లర్ 10 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. రూట్ 65 పరుగులతో ఉన్నాడు.
బ్రూక్ అవుట్
46.5వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (14) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 324-3. రూట్ 55 పరుగులతో ఉన్నాడు. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు.
రూట్ హాఫ్ సెంచరీ
45.3వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రూట్. 39 బంతుల్లోనే యాభై పరుగులు సాధించిన రూట్. వన్డేల్లో అతడికి ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్ స్కోరు 315-2 (46). రూట్ 50, బ్రూక్ పది పరుగులతో ఉన్నారు.
45 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 305-2
హ్యారీ బ్రూక్ 5, రూట్ 45 పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
43.3వ ఓవర్: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ శతక వీరుడు బెన్ డకెట్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 135 బంతులు ఎదుర్కొన్న డకెట్ 18 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 141 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.
నలభై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 261-1
డకెట్ 125 బంతుల్లో 127, రూట్ 22 బంతుల్లో 23 పరుగులతో ఉన్నారు.
డకెట్ సెంచరీ
35.2వ ఓవర్: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్. 108 బంతుల్లో శతక మార్కు అందుకున్న డకెట్. 36 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ స్కోరు: 226-1(36). డకెట్ 102, రూట్ 13 పరుగులతో ఉన్నారు.
200 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్
33 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 206-1.
డకెట్ 90, రూట్ ఐదు పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ డౌన్.. సెంచరీ మిస్
30.1వ ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన బెతెల్ (93 బంతుల్లో 91). ఆద్యంతం నిలకడగా ఆడి సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.
ఇంగ్లండ్ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం
ముప్పై ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 192-0. టీమిండియాపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. బెతెల్ 91, డకెట్ 81 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 180 బంతుల్లో 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 163-0
బెతెల్ 79, డకెట్ 65 పరుగులతో ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వన్డేల్లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం (163).
డకెట్ ఫిఫ్టీ
21.3: గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి.. యాభై పరుగుల మార్కు అందుకున్న డకెట్. 64 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన డకెట్. ఇంగ్లండ్ స్కోరు: 136- 0 (21.5)
20 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 125-0
బెతెల్ 61, డకెట్ 46 పరుగులతో ఉన్నారు.
బెతెల్ అర్ధ శతకం
15.4వ ఓవర్: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ ఓపెనర్ బెతెల్. ఇంగ్లండ్ స్కోరు: 101-0(16). బెతెల్ 53, డకెట్ 34 పరుగులతో ఉన్నారు.
పదిహేను ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 96-0(15)
బెతెల్ 48, డకెట్ 34 పరుగులతో ఆడుతున్నారు.
పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 58-0(10)
బెతెల్ 25, డకెట్ 22 పరుగులతో ఉన్నారు.
హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లండ్
బెతెల్ 23, డకెట్ 18 పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు: 51-0 (8.1).
నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు
అర్ష్‌దీప్ సింగ్ టీమిండియా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జేకబ్ బెతెల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 31-0. డకెట్ 15, బెతెల్ 14 పరుగులతో ఉన్నారు.
భారత్‌కు ఎదురుదెబ్బ
భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం వల్ల దూరం కాగా.. భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది.
కేఎల్ రాహుల్ తిరిగి రాగా శివం దూబే బెంచ్‌కే పరిమితం కాగా.. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. వాషీకి బదులు ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు.
దిగ్గజానికి నివాళి
గ్యారీ సోబర్స్‌కు నివాళిగా ఇరుజట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లతో బరిలోకి దిగారు.
గంట మోగించిన యువీ
లార్డ్స్ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించాడు.
Yuvraj Singh rings the iconic Lord's Bell to signal the start of the series decider. 🔔
Watch #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/OcQ6C2e7du— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026
తుదిజట్లు
భారత్
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లండ్
బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.


