చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు | Rohit Sharma Attains ODI Feat That Not Even Virat Kohli Or Sachin Tendulkar Have Achieved | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

Jul 19 2026 11:14 PM | Updated on Jul 19 2026 11:30 PM

Rohit Sharma Attains ODI Feat That Not Even Virat Kohli Or Sachin Tendulkar Have Achieved

PC: BCCI Twitter

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో రోహిత్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో అతడు చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ కేవలం కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్భుత సెంచరీతో  రోహిత్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్‌ సాధించిన రికార్డులు ఇవే
👉ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్  సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ గ్రౌండ్‌లో అత్యధిక వన్డే స్కోరు చేసిన భారత్ ఆటగాడిగా రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గంగూలీని హిట్‌మ్యాన్(138) అధిగమించాడు. ఈ రికార్డు సచిన్‌, కోహ్లి వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు.

👉విదేశీ గడ్డపై ఒకే దేశంలో అత్యధిక అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్‌ సృష్టించాడు ఇంగ్లండ్‌లో  రోహిత్‌కు ఇది ఎనిమిదవ వన్డే సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, డివిలియర్స్‌, క్వింటన్ డికాక్ సంయుక్తంగా ఉండేది. వీరంతా ఒకే దేశంలో 7 వన్డే సెంచరీలు నమోదు చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించడంతో రోహిత్ ఈ దిగ్గజ క్రికెటర్లను దాటేశాడు.

👉వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (38 ఏళ్ల 327 రోజులు) పేరిట ఉండేది.

👉అంతర్జాతీయ క్రికెట్‌లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.  సేనా దేశాల జట్లపై రోహిత్ ఇప్పటివరకు 343 సిక్సర్లు కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(342) పేరిట ఉండేది. రోహిత్, గేల్ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(179), ఎంఎస్ ధోని(177), షాహిద్ అఫ్రిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement