Photo Credit: BCCI Twitter
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్‌కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికల్లో జట్టులో రోహిత్ శర్మ ఉంటాడని సైకియా అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా రేపు జరగనున్న చివరి వన్డే కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు వచ్చారు. ఈ సమయంలో రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో సుదీర్ఘంగా చర్చించిన ఫొటోలు బయటికి వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలో సితాన్షు కోటక్‌తో రోహిత్ మాట్లాడుతూ..'బయట జరుగుతున్న విషయాలతో మనకు సంబంధం లేదు. అవన్నీ పట్టించుకోవద్దు' అని పేర్కొనడం వినిపించింది. దీంతో అసలు టీమిండియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్‌కు సంబంధించి ఇంటర్నల్ చర్చలు కూడా జరగలేదని దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.
ఇక శుక్రవారం రోహిత్ వన్డే కెరీర్‌పై సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్ చివరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్ వన్డే అతడికి చివరి మ్యాచ్ కాదు’ అని సైకియా వెల్లడించాడు.
సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పడ్డట్లు అయింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి.
Rohit Sharma 🗣️ Dekho yeh sb yhha khada hai "bahar kya chal raha hai ussya hamara kya lena dena" 🔥
ROHIT FOR 2027 WC 🙌🏻#RohitSharma #odiworldcup2027 pic.twitter.com/cR4p52AS3Q— THE LLORD (@BlueBloodcric) July 18, 2026
చదవండి: సిరీస్ విజయంపై గురి.. లార్డ్స్‌లో టీమిండియాకు ఘన చరిత్ర!


