ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా! | Mbappe Breaks Messi FIFA World Cup Record, Extends Golden Boot Lead Despite France's Defeat | Sakshi
Sakshi News home page

ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!

Jul 19 2026 8:00 AM | Updated on Jul 19 2026 12:24 PM

France Star-Mbappe-Surpasses-All Time FIFA WC-Record-Golden Boot-Hunt

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జ‌రిగిన పోరులో ఫ్రాన్స్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ, ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు కైలియ‌న్ ఎంబాపె మాత్రం ప్ర‌పంచ రికార్డుతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ఈ ఫిఫా టోర్నీలో త‌న గోల్స్ సంఖ్య‌ను ప‌దికి పెంచుకున్నాడు. 

ఈ నేప‌థ్యంలో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపె (10 గోల్స్‌, 4 అసిస్ట్‌లు) మ‌రోసారి అగ్ర‌స్థానంలో నిలిచాడు. మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇవాళ జ‌ర‌గ‌నున్న ఫిఫా ఫైన‌ల్లో మెస్సీ కనీసం రెండు గోల్స్, ఒక అసిస్ట్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంత‌మ‌వుతోంది. లేదంటే ఎంబాపె దానిని ఎగ‌రేసుకుపోతాడు. 


Photo Credit: FIFA Twitter

ఇక ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ కొట్టిన జాబితాలోనూ మెస్సీని ఎంబాపె దాటేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 20 గోల్స్‌తో ఉన్న ఎంబాపె మ‌రో రెండు గోల్స్ న‌మోదు చేయ‌డంతో త‌న సంఖ్య‌ను 22కు పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా స్టార్‌ మెస్సీ 21 గోల్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో మెస్సీ గోల్ చేయ‌కుంటే మాత్రం ఎంబాపె టాప్‌లో ఉంటాడు. ఈ ఫిఫా అనంత‌రం ఒక‌వేళ‌ మెస్సీ రిటైర్ అయితే మాత్రం ఎంబాపె ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడిగానూ రికార్డులకెక్కనున్నాడు.

స్పెయిన్‌తో సెమీస్‌లో సమ‌న్వ‌య లోపం వ‌ల్ల ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయిన ఫ్రాన్స్ మూడో ప్లేస్ కోసం జ‌రిగిన పోరులో మాత్రం గెలిచేందుకు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నించింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 తేడాతో ఫ్రాన్స్‌పై విజ‌యం సాధించి బ్రాంజ్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకుంది. 

ఇంగ్లండ్ త‌ర‌ఫున బుకాయో సాకా (37వ‌, 45+1వ‌, 87వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో  మెరవ‌గా, డెక్ల‌న్ రైస్ (3వ నిమిషం), ఎరిక్ కోన్సా (18వ నిమిషం), జూడ్ బెల్లింగ్ హ‌మ్ (90+8వ నిమిషం) గోల్స్ సాధించారు. ఫ్రాన్స్ త‌ర‌ఫున కైలియ‌న్ ఎంబాపె (48, 66వ నిమిషం) డ‌బుల్ గోల్స్‌తో మెర‌వ‌గా, బ్రాడ్లీ బార్కోలా (54వ నిమిషం), ఉస్మాన్ డెంబెలె  (90+6వ నిమిషం) గోల్స్ చేశారు.

గోల్డెన్ బూట్ రేసులో ఉన్న ఆట‌గాళ్ల జాబితా:
👉కైలియన్ ఎంబాపే: గోల్స్: 10, అసిస్ట్‌లు: 4
👉లియోనెల్ మెస్సీ : గోల్స్: 8, అసిస్ట్‌లు: 4
👉ఎర్లింగ్ హాలాండ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 0
👉జూడ్ బెల్లింగ్‌హామ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 1
👉హ్యారీ కేన్ : గోల్స్: 6, అసిస్ట్‌లు: 1
👉ఉస్మాన్ డెంబెలె : గోల్స్: 6, అసిస్ట్‌లు: 2

 

చదవండి: టీ20 సిరీస్‌.. జింబాబ్వేకు బ‌య‌ల్దేరి వెళ్లిన టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement