చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి | Rohit Sharma And Virat Kohli Create History, Become 1st Indian Pair Play 400 International Matches Together | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి

Jul 19 2026 5:41 PM | Updated on Jul 19 2026 6:22 PM

Rohit Kohli become 1st Indian pair play 400 International matches together

PC: BCCI X

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా రో-కో ఈ ఫీట్‌ నమోదు చేశారు.

అగ్రస్థానంలో ఎవరంటే?
ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార్‌ సంగక్కర- మహేళ జయవర్ధనె కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచ్‌లలో భాగమయ్యారు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ లంక దిగ్గజాలే ఉండటం విశేషం. ఇక రోహిత్‌- కోహ్లి జోడీ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికి 287 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్‌ కోహ్లి 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటికి 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా
టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్‌- కోహ్లి సంయుక్తంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది రోహిత్‌ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా.. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లి సైతం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇద్దరూ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ చేతిలో 4-0తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది టీమిండియా. ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో తడబడింది. ఫలితంగా సిరీస్‌ 1-1తో సమం కాగా.. లార్డ్స్‌ వేదికగా ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేతో విజేత ఎవరో తేలుతుంది.

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రోహిత్‌ 11 పరుగులు చేయగా.. కోహ్లి 5 పరుగులకే అవుటయ్యాడు. ఇక రెండో వన్డేలో రోహిత్‌ 28 పరుగులు చేయగా.. కోహ్లి అర్ధ శతకం (65)తో అలరించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీలు
👉కుమార్‌ సంగక్కర- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 550 మ్యాచ్‌లు
👉తిలకరత్నె దిల్షాన్‌- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 426 మ్యాచ్‌లు
👉కుమార్‌ సంగక్కర- తిలకరత్నె దిల్షాన్‌ (శ్రీలంక): 418 మ్యాచ్‌లు
👉సనత్‌ జయసూర్య- ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక): 408 మ్యాచ్‌లు
👉జాక్వెస్‌ కలిస్‌- మార్క్‌ బుచర్‌ (సౌతాఫ్రికా): 407 మ్యాచ్‌లు
👉రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి (ఇండియా): 400* మ్యాచ్‌లు.

చదవండి: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement