లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 388 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో హిట్‌మ్యాన్ కేవలం 84 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో తన 34వ వన్డే శతకాన్ని అందుకున్నాడు.
తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్న వారికి రోహిత్ బ్యాట్‌తోనే సమాధనమిచ్చాడు. లార్డ్స్‌లో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా 110 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ ముంబై ఆటగాడు తన సూపర్ సెంచరీ ఈ రూమర్స్‌కు చెక్‌పెట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


