Mullanpur
-
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్‌గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్‌పూర్‌లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్‌ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యంభారత్తో మ్యాచ్‌లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్‌కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు! -
రాహుల్, గిల్ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్ 103, పంత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) నిరాశపరచగా.. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్ రహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.శుబ్‌మన్ గిల్ సెంచరీ82.5: సలీమ్ సఫీ బౌలింగ్‌లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్. స్కోరు: 358/3 83).మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)గిల్ 91, పంత్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్ అవుట్. క్రీజులోకి రిషభ్ పంత్. స్కోరు: 249/3 (61). గిల్ 39 పరుగులతో ఉండగా.. పంత్ రెండు పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ60.1: జియాఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. కెరీర్లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్.45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2గిల్ 8, రాహుల్ 75 పరుగులతో ఉన్నారు.సాయి సుదర్శన్ అవుట్42.4: సలీమ్ సపీ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రాగా.. రాహుల్ 72 పరుగులతో ఉన్నాడు.సాయి అర్ద శతకం31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. స్కోరు: 133/1 (31.4)కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. టెస్టు కెరీర్లో అతడికి ఇది 21వ హాఫ్ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.లంచ్ బ్రేక్‌కు భారత్ స్కోరెంతంటే?లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సాయిసుదర్శన్(32) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సుదర్శన్, రాహుల్21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(32), సాయిసుదర్శన్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్.. సలీం బౌలింగ్‌లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న భారత్భారత ఓపెనర్లు రాహుల్(16), యశస్వి జైశ్వాల్(20) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.బ్యాటింగ్ భారత్దేముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో రాజస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుత్తార్ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.అదేవిధంగా సాయిసుదర్శన్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ ఇచ్చారు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
SRH vs RR: వర్షం పడితే ఇంటికే!.. ఆ ఛాన్సే లేదు!
ఐపీఎల్-2026 తొలి ఫైనలిస్టు ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.అయితే, ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ గుజరాత్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం మిగిలే ఉంది. ఇక బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌తో గుజరాత్‌తో తలపడేది ఎవరన్న అంశం తేలిపోనుంది.రిజర్వ్ డేలు ఉండవుఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. మరి ఈ నాకౌట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏమిటి?.. కాగా ఐపీఎల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు ఉండవు. కాబట్టి వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ నేరుగా క్వాలిఫయర్-2లో అడుగుపెడుతుంది. కాగా సన్‌రైజర్స్ లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది గెలిచి మూడో స్థానంలో ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిది విజయాలు సాధించి నాలుగో స్థానంతో ముగించింది.వాతావరణం ఎలా ఉందంటే?అయితే, చండీగఢ్‌లో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. సగటుల 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదువుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక సాయంత్రం వేళ కూడా దాదాపు 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్‌కు వేదికైన ముల్లన్‌పూర్‌లో వర్షం పడే సూచనలైతే దాదాపుగా లేవు.చదవండి: వైభవ్ మాపై శతక్కొట్టవచ్చు.. కానీ: కమిన్స్ -
మరీ ఇంత కుళ్లు పనికిరాదు!.. నీకంటే అతడే బెస్ట్!
పద్నాలుగేళ్ల వయసులోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు దేశీ క్రికెట్లో.. అటు ఐపీఎల్లో సత్తా చాటుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారిన ఈ బిహారీ కుర్రాడు ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.583 పరుగులుఇక ఇటీవలే పదిహేనవ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం ఉంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తరఫున లీడ్ రన్‌స్కోరర్‌గా ఉన్న వైభవ్.. ఓవరాల్‌గా టాప్-5లో కొనసాగుతున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు.ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైభవ్‌కు రోజురోజుకూ ఆదరణ మరింత పెరుగుతోంది. నిజానికి ప్రస్తుతం రాయల్స్ పోస్టర్ బాయ్‌గా వైభవ్ అవతరించాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీ పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.వైభవ్ పట్ల రియాన్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్సన్రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వైభవ్ సహా రాయల్స్ జట్టు మొత్తం ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.సెలబ్రిటీలను కెమెరాలో బంధించే పాపరాజీలు.. రియాన్ పరాగ్‌ను పిలిచి.. ‘రియాన్ వైభవ్‌తో ఒక్క ఫొటో కావాలి’ అని అడిగారు. ఇందుకు.. ‘మేమేమీ సినిమా స్టార్లము కాదు’ అని రియాన్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.Look at Vaibhav Suryavanshi’s reaction when the paparazzis said to Riyan Parag, “Riyan, Vaibhav ke saath ek photo please,” and Riyan replied, “Hum koi film star nahi hain.” After hearing this, Vaibhav Suryavanshi’s smile disappeared. 👀Later, the paparazzis said to Vaibhav,… pic.twitter.com/sXsyhTGgCb— Sonu (@Cricket_live247) May 26, 2026అందరి రికార్డులూ బద్దలు కొడతాడుదీంతో అప్పటిదాకా చిరునవ్వులు చిందించిన వైభవ్.. కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో ఓ పాపరాజీ.. ‘వైభవ్ ఏ సినీ స్టార్ కంటే కూడా తక్కువ కాదు. అతడు అందరి రికార్డులూ బద్దలు కొడతాడు’’ అని పేర్కొన్నాడు. దీంతో వైభవ్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరీ అంత కుళ్లు పనికిరాదుఈ నేపథ్యంలో.. ‘‘వైభవ్‌పై మరీ అంత కుళ్లు పనికిరాదు.. జట్టుకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు?.. పిల్లాడిని ఇంతలా అప్సెట్ చేస్తావా? నీ ఇగోకు మూల్యం చెల్లించకతప్పదులే’’ అని నెటిజన్లు రియాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా రాజస్తాన్ విజయాల్లో ఆటగాడిగా రియాన్ పాత్ర పెద్దగా లేదు. పైగా ఇటీవల డ్రెసింగ్‌రూమ్‌లో చట్టవిరుద్ధంగా ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కి రాజస్తాన్ పరువు తీశాడు. ఇందుకు బదులుగా బీసీసీఐ జరిమానాతో సరిపెట్టగా.. రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్ -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్‌గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. కానీ
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ముల్లన్పూర్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్పూర్ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.క్వింటన్ డికాక్ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు. దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి!


