ది హండ్రెడ్ లీగ్-2026కు ముందు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ గాయం కారణంగా హండ్రెడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో బెతల్ మోకాలికి గాయమైంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని అస్పత్రికి తరలించి స్కాన్ చేయగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బెతల్‌కు వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు హెండ్రెడ్ లీగ్‌కు దూరమయ్యాడు.
ఆగస్టు 19 నుంచి స్వదేశంలో శ్రీలంకతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూడా బెతల్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించడం లేదు. ఆ తర్వాత జరిగే టీ20ల్లో బెతల్ ఆడే అవకాశముంది.
కాగా ఈ యువ ఆటగాడు ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లోనూ బెతల్ సత్తాచాటాడు. ఇక బెతల్ గైర్హజరీలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్‌గా డొనావన్ ఫెరీరా వ్యవహరించనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.
బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ఇదే
రెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డొనోవాన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మ్యాథ్యూ మోంట్‌గోమరీ, మిచ్ ఓవెన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిక్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్..


