ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 164 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆతర్వాతి బంతికే జియా ఉర్ రహ్మాన్ షరిఫీ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఇలా సెంచరీ చేసిన వెంటనే ఔట్ కావడం మూడోసారి.
ఈ సెంచరీ రాహుల్‌కు 12వ టెస్ట్ సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్‌పై మొదటిది. 12 సెంచరీల్లో రాహుల్ సాధించిన ఆరో దేశం ఆఫ్ఘనిస్తాన్. మూడు ఫార్మాట్లో రాహుల్‌కు ఇది 22వ సెంచరీ. టెస్ట్‌ల్లో 12తో పాటు 8 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు రాహుల్ ఖాతాలో ఉన్నాయి.
ఈ సెంచరీతో రాహుల్ భారత్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ (33) టాప్ ప్లేస్‌లో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (22), మురళీ విజయ్ (12) రాహుల్ (11) కంటే ముందున్నారు. తన 12 టెస్ట్ సెంచరీల్లో రాహుల్ 11 ఓపెనర్‌గా సాధంచగా.. ఒకటి మిడిలార్డర్ బ్యాటర్‌గా సాధించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 64 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 276-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (62), వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.


