భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్‌లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు.
ముల్లాన్‌పూర్‌లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.
2023లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.
నబీ, రషీద్ దూరం!
కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సీనియర్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు.
41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు.
వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాల
రెండో వన్డే-జూన్ 17-లక్నో
మూడో వన్డే-జూన్ 20-చెన్నై
వన్డే సిరీస్‌కు జట్లు
భారత్
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్‌నూర్ బ్రార్
అఫ్గానిస్తాన్
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్‌ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీ
చదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'


