కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు... | Raja Muthupandi shifts from Kabaddi to weightlifting | Sakshi
Sakshi News home page

కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు...

Jul 28 2026 12:53 AM | Updated on Jul 28 2026 12:56 AM

Raja Muthupandi shifts from Kabaddi to weightlifting

రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్‌పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్‌ కాగా, తల్లి పెచ్చియమ్మాల్‌ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్‌ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్‌నెస్‌ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. 

రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్‌ అతడిని భవిష్యత్‌ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) హాస్టల్‌లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్‌/జూనియర్‌ కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 

2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్‌ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్‌ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement