టీమిండియాకు గుడ్ న్యూస్. టీ20 ప్రపంచకప్-2026కు ముందు గాయపడిన స్టార్ పేసర్ హర్షిత్ రాణా, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హర్షిత్.. అఫ్గాన్‌తో మూడో వన్డేకు ముందు భారత జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
వాస్తవానికి అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హర్షిత్ లేడు. కానీ ఇప్పుడు అతడు కోలుకోవడంతో గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానంలో జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఐర్లాండ్,ఇంగ్లండ్ పర్యటనలకు మాత్రం ముందే అతడిని ఎంపిక చేశారు.
ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఉన్నాడు. అతడు ప్రతి రోజూ 9-10 ఓవర్లు బౌలింగ్ చేస్తూ, తన బ్యాటింగ్‌పై కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాడని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. జూన్ 17 నాటికి అతడికి సీఓఈ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
సీఓఈ వైద్య బృందం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతడు నేరుగా మూడో వన్డేకు ముందు చెన్నైలో జట్టుతో కలవనున్నాడు. హర్షిత్ చివరగా భారత్ తరపున వన్డేల్లో ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన రాణా.. 6.22 ఏకానమితో 26 వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాట్‌తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో టీమ్ మెనెజ్‌మెంట్ అతడిని ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్
చదవండి: వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్


