ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్‌ షాకింగ్‌ రియాక్షన్‌! | Rohit Sharma's eye-catching reaction as Virat Kohli drops easy catch | Sakshi
Sakshi News home page

IND vs AFG: ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన కోహ్లి.. రోహిత్‌ షాకింగ్‌ రియాక్షన్‌!

Jun 21 2024 4:52 PM | Updated on Jun 21 2024 4:59 PM

Rohit Sharma's eye-catching reaction as Virat Kohli drops easy catch

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీ లీగ్‌ స్టేజీలో నిరాశపరిచిన కింగ్‌ కోహ్లి.. ఇప్పుడు సూపర్‌-8లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.

సూపర్‌-8లో భాగంగా బార్బోడస్‌ వేదికగా గురువారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. సరిగ్గా 24 పరుగులు చేసి రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి కాస్త ఇబ్బంది పడ్డాడు.

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ బ్యాటింగ్‌ పరంగానే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరిచాడు. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు. 

ఎన్నో సంచలన క్యాచ్‌లు అందుకున్న కింగ్‌ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో సునాయస క్యాచ్‌ను జారవిడిచడంతో అంతా ఆశ్చ్యర్యపోయారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన చేతులు తలపై పెట్టుకుని షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లి విడిచిపెట్టిన క్యాచ్‌ పెద్ద కాస్ట్‌లీగా మారలేదు. ఎందకుంటే ఆ తర్వాతి ఓవరే జద్రాన్‌(8) అక్షర్‌పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement