టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్ నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.
రోహిత్ త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం తనదైన క్లాస్‌ను ప్రదర్శించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
🚨🚨ROHIT SHARMA OUT OF THE FIRST 2 ODIs AGAINST AFGHANISTAN [CRICBUZZ]
According to reliable sources and reports, Rohit Sharma suffered a knee twist after losing balance and is feeling discomfort.
As per reports, he won't be available for the opening two games. India's… pic.twitter.com/xVn7qXcQg0— Oxygen (@Oxygen18_) June 3, 2026
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్‌లాగే టెస్ట్, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో రోహిత్‌తో పోలిస్తే విరాట్ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్‌లో తన జట్టు ఛాంపియన్‌గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
రోహిత్, విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్‌లో ఉండి, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లు జూన్ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి.


