ముల్లన్‌పూర్ వేదికగా భారత్, అప్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అర్థసెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్‌తో కలిసి నిలకడగా ఆడుతున్న రాహుల్ రెండో వికెట్‌కు అతడితో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 153 పరుగులు చేసింది.
అయితే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు ఒక లైఫ్ లభించింది. జియావు్ రెహ్మాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని కేఎల్ రాహుల్ కట్ షాటే ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సరైన టైమింగ్ కుదరక బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే క్యాచ్ అవుట్ అంటూ కీపర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు.
అప్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది రివ్యూ వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అయితే బౌలర్‌తో పాటు సెకండ్ స్లిప్‌లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్‌లు ఆత్మవిశ్వాసంతో రివ్యూకు వెళ్లాలని కెప్టెన్‌కు చెప్పినప్పటికీ, కీపర్ సందేహం వ్యక్తం చేయడంతో హష్మతుల్లా డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో బంతి కేఎల్ రాహుల్ బ్యాట్‌కు తగిలినట్లు స్పైక్‌వచ్చింది.
దీంతో రివ్యూ తీసుకోకుండా తప్పు చేశానే అని హష్మతుల్లా తెగ బాధపడిపోయాడు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేనట్లే రివ్యూ వెళ్లకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. ఈ విషయం పక్కనబెడితే కేఎల్ రాహుల్ తాను ఔట్ అని తెలిసినప్పటికీ బంతి ఎడ్జ్ అవ్వలేదంటూ అంపైర్‌కు సైగ చేసి పక్కదారి పట్టించాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అభిమానులు మండిపడ్డారు.
తాను ఔట్ కావద్దని ప్రతీ ఆటగాడిగా స్వార్థం ఉండడం సహజమేనని, కానీ కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా తనంతట తాను మైదానం వీడి ఉంటే అతడిపై గౌరవం పెరిగి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ స్పిరిట్‌కు విరుద్ధంగా రాహుల్ చర్య ఉందని విమర్శిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో ఒక లైఫ్ పొందిన కేఎల్ రాహుల్ టీమిండియా 107 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్థశతకం మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు ఉన్నాయి. ఈ అర్థశతకంతో కేఎల్ రాహుల్ 9వేల ఫస్ట్‌క్లాస్ పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం.
Rahul confused the AFG team and made them believe it was his bat's sound. Well Played Rahul 👏 https://t.co/enVYHa7AKe pic.twitter.com/OaWR4MrhLu
— Varun (@The_MythBreaker) June 6, 2026


