ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 48 జట్లు ఆడనున్నాయి. ఇందుకోసం క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 34 జట్లు సాకర్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించాయి. ఇంకా 14 స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. ఫిఫా చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. 16 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. సాకర్ కప్ 2026.. జూన్ 11న ప్రారంభమై, జూలై 19న ముగుస్తుంది.
ఆతిథ్య దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో.. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. కేప్ వెర్డే, కురాకావో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ తొలిసారిగా సాకర్ బరిలో నిలిచాయి. 2022లో మూడవ టైటిల్‌ను గెలుచుకున్న అర్జెంటీనా (Argentina) డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పోటీకి దిగుతుంది. ఇంగ్లండ్, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి అగ్రశేణి జట్లు ఇప్పటికే అర్హత సాధించి పోటీకి సై అంటున్నాయి. 8 క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ ఎనిమిదింటిలోనూ గెలిచి జోరు మీద ఉంది.
27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్వే (Norway) జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. గ్రూప్ 'ఐ'లో జరిగిన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన ఇటలీ జట్టును 4-1 గోల్స్ తేడాతో ఓడించింది. 24 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచి 1998 తర్వాత మళ్లీ ప్రపంచకప్ రేసులో నిలిచింది. గ్రూప్ 'ఎఫ్' నుంచి పోర్చుగల్ వరుసగా ఏడోసారి వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది. 2010లో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణాఫ్రికా 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ కప్‌లో అడుగుపెట్టింది. ఆఫ్రికా నుంచి 9, ఆసియా నుంచి 8, యూరప్ నుంచి 7, దక్షిణ అమెరికా నుంచి 6 జట్లు ఇప్పటివరకు అర్హత సాధించాయి.
ఫుట్‌బాట్ ప్రపంచ కప్ 2026కు అర్హత సాధించిన జట్లు ఇవే
ఆఫ్రికా:
అల్జీరియా
కేప్ వెర్డే
ఈజిప్ట్
ఘానా
ఐవరీ కోస్ట్
మొరాకో
సెనెగల్
దక్షిణాఫ్రికా
ట్యునీషియా
ఆసియా:
ఆస్ట్రేలియా
ఇరాన్
జపాన్
జోర్డాన్
ఖతార్
సౌదీ అరేబియా
దక్షిణ కొరియా
ఉజ్బెకిస్తాన్
యూరప్:
క్రొయేషియా
ఇంగ్లాండ్
ఫ్రాన్స్
జర్మనీ
నెదర్లాండ్స్
నార్వే
పోర్చుగల్
ఉత్తర- మధ్య అమెరికా:
కెనడా (సహ-హోస్ట్)
మెక్సికో (సహ-హోస్ట్)
యునైటెడ్ స్టేట్స్ (సహ-హోస్ట్)
ఓషియానియా:
న్యూజిలాండ్
దక్షిణ అమెరికా:
అర్జెంటీనా
బ్రెజిల్
కొలంబియా
ఈక్వెడార్
పరాగ్వే
ఉరుగ్వే
ఫిఫా ప్రపంచ కప్ కోసం డ్రా డిసెంబర్ 5న వాషింగ్టన్ DCలోని కెన్నెడీ సెంటర్‌లో జరుగుతుంది. 2026 ప్రపంచ కప్ (FIFA World Cup 2026) జూన్ 11న ప్రారంభమవుతుంది. మెక్సికో నగరంలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. జూలై 19న న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.
చదవండి: నార్వే నిరీక్షణ ముగిసె..
ప్రపంచ కప్‌కు అర్హత సాధించే 48 జట్లతో నాలుగు చొప్పున 12 గ్రూపులుగా విభజిస్తారు. పాయింట్ల ఆధారంగా ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. టోర్నమెంట్‌లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడతాయి. ఇందులో నెగ్గిన జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి. మూడో స్థానం కోసం సెమీస్‌లో ఓడిన రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది.
34/48 ✅@aramco | #FIFAWorldCup pic.twitter.com/IULE2TlTsD
— FIFA World Cup (@FIFAWorldCup) November 18, 2025


