అబ్బుర పరిచే వింతలకు, లగ్జరీ భవనాలకు విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్‌లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.
సోషల్‌లో షేర్ అవుతున్న నివేదికల ప్రకారం 2034 FIFA (FIFA World Cup 2034) ప్రపంచ కప్ కోసం మ్యాచ్‌లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్నిప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న ఏ స్టేడియం 2034 ఫీఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. 46,000 మంది కూర్చోవచ్చట. 48-జట్ల టోర్నమెంట్‌ను నిర్వహించడానికి సౌదీ అరేబియా నిర్వహించే గ్లోబల్ ఈవెంట్‌కు ఇది మరింత వన్నె తెస్తుందని అంచనా.

🚨Saudi Arabia is set to construct the planet's inaugural "sky stadium," dubbed the NEOM Stadium, seamlessly embedded within the visionary metropolis of The Line.
Elevated an astonishing 350 meters (1,150 feet) in the air, this innovative venue will boast 46,000 seats and rely… pic.twitter.com/Djn8QZsyPB— KILOWI BLOG ⚽🏀🥊 (@larry_graphics_) October 22, 2025
మరోవై పుప్రపంచ కప్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందా అనేదానిపై చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. 2017లో ప్రారంభించబడిన నియోమ్, ఇప్పటికే జాప్యాలు, లాజిస్టికల్ సవాళ్లు, మానవ హక్కులు మరియు పర్యావరణ సమస్యలపై విమర్శలను ఎదుర్కొంది. అయితే దీనిపై సౌదీ అధికారులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. ఇది సాకారం అయితే, స్కై స్టేడియం చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మచ్చుతునకగా మిగిపోనుంది. కాగా 2034 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు బిడ్ సమర్పించిన ఏకైక దేశం సౌదీ అరేబియా. ఇంతకు ముందు ఎన్నడూ లేని నిర్వహించనున్న ప్రపంచ కప్ ఈవెంట్‌లో ఇదే స్పెషల్ కానుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!


