జెనీవా: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) వచ్చే ఏడాది జరగనున్న ‘ఫిఫా’ ప్రపంచకప్ (FIFA World Cup) ఆరంభ మ్యాచ్‌లో బరిలోకి దిగడంపై సందిగ్ధత వీడింది. ఇటీవల ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా రొనాల్డోకు ‘రెడ్ కార్డు’ దక్కింది. దీంతో అతడిపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది.
అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఏడాది తర్వాత అమలు చేయవచ్చని ‘ఫిఫా’ వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ నెల 16న అర్మేనియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన రొనాల్డో... వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నాడు.
కాగా 2026 జూన్ 11 నుంచి అమెరికా, కెనడా, మెక్సికో వేదికగా ‘ఫిఫా’ ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు పోర్చుగల్ జట్టు రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది.
ఫుట్‌బాట్ ప్రపంచ కప్ 2026కు అర్హత సాధించిన జట్లు ఇవే
అల్జీరియా, కేప్ వెర్డే, ఈజిప్ట్ , ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో, సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యునీషియా, ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్.


