మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి, భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డట్లు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతి క్లారా బ్రూగాడా తెలిపారు.
అధ్యక్షురాలు క్లౌడియా షైన్‌బామ్ తన ప్రత్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే భూకంప అలారం మోగడంతో బయటకు వెళ్లి, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి నివేదిక బయటకు రాలేదు. కాకపోతే భూకంప తీవ్రత ఎక్కువగానే ఉందని స్థానికులు అంటున్నారు.


