
ఇస్లామిక్ తీవ్రవాదుల పనేనని అనుమానం
గోమా: కాంగోలోని కేథలిక్ చర్చిలో ఐఎస్ అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన నరమేథంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యా హ్నం ఒంటిగంట సమయంలో చర్చిలోకి తుపా కులు, కత్తులతో ప్రవేశించిన అలైడ్ డెమో క్రాటిక్ ఫోర్స్(ఏడీఎఫ్)కు చెందిన దుండగులు కాల్పులు జరుపుతూ దొరికిన వారిని దొరికినట్లు నరికారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం కొందరిని తమ వెంట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఎందరిని తీసుకెళ్లిందీ తెలియాల్సి ఉంది.అంతకుముందు వారు చర్చి చుట్టుపక్కల నివాసాలకు నిప్పుపెట్టారు.‘మృతదేహాలు ఇప్ప టికీ చర్చి ప్రాంగణంలోనే ఉన్నాయి.
చర్చి ఆవరణలోపలే వీరందరికీ సామూహిక ఖననాలు జరిపేందుకు వలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు’అని ఇటురి ప్రావిన్స్ లోని కొమాండ అధికారి ఒకరు తెలిపారు. 10 మంది చనిపోయినట్లు మిలటరీ చెబుతు న్నా.. స్థానిక మీడియా మాత్రం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి పైగానే ఉంటుందని పేర్కొంది. ఐరాసకు చెందిన రేడియో స్టేషన్ మాత్రం 43 మంది వరకు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యం తెలిపిందని వెల్లడించింది. అంతకుముందు, సమీపంలోని మచోంగమి గ్రామంపై ఉగ్రవాదులు దాడిచేసి ఐదుగురిని పొట్టన బెట్టుకున్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
