చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి | Hongqi Bridge Collapse In Chaina | Sakshi
Sakshi News home page

చైనాలో కలకలం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి

Nov 12 2025 1:00 PM | Updated on Nov 12 2025 2:50 PM

Hongqi Bridge Collapse In Chaina

చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం బట్టబయలైంది. చైనా-టిబెట్‌ను కలిపెందుకూ ఇటీవలే ప్రారంభించిన హాంగ్ కీ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ లో నిర్మించిన ఈ బ్రిడ్జి 758 మీటర్ల పొడవైంది. వంతెన కూలడానికి గల కారణాలు తెలవాల్సి ఉంది.

చైనా సియాచిన్ ప్రావిన్స్ లో టిబెట్-చైనాను కలుపుతూ నిర్మించిన హాంగ్ కీ బ్రిడ్జీని కొద్దిరోజుల కిందటే ప్రారంభించారు. కాగా మంగళవారం ఉదయం సమయంలో బ్రిడ్జి ప్రారంభంలోని భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో వంతెనపైనుంచి వాహనాలు ఏమి వెళ్లకపోవడం, అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వంతెన కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. 758 మీటర్ల పొడవైన ఈ వంతెన సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుంది. వంతెన కూలిన సమయంలో భారీగా శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ లో తామెప్పుడూ ముందుంటాం అనే చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement