బంగ్లాదేశ్‌లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్థులు భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. భారత్ వ్యతిరేక భావజాలం ఉన్న నేతలు ప్రస్తుతం అక్కడ బలంగా ఉండడంతో పాటు ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం ఆదేశానికి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదేశానికి చెందిన కొంతమంది నేతలు ఇండియాపై కారుకూతలు కూశారు. అంతేకాకుండా ఇటీవల అక్కడ భారత వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థి నేతల ఉస్మాన్ హాదీ హత్య తరువాత అక్కడ అలర్లు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపారు. కాగా ఇప్పుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు.
అక్కడి అడిషనల్ కమిషనర్ నార్జూల్ ఇస్లాం మాట్లాడుతూ" ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నేరస్థులు, మైమెన్ సింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోని మేఘాలయలోకి ప్రవేశించారు. అనంతరం వారిని పూరి అనే వ్యక్తి రిసీవ్ చేసుకొని, సమీ అనే ట్యాక్స్ డ్రైవర్ అక్కడి టూరా సిటిీలో దించారు." అని తెలిపారు. ఈ వివరాలను అక్కడి డైలీ స్టార్ పత్రిక ప్రచురించింది.
అయితే పూరి, సమీలిద్దరినీ భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారే అనధికార సమాచారం తమకు అందిందని ఆయన తెలిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. నేరస్థులను బంగ్లాదేశ్ రప్పించేలా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపాయి . అయితే ఈ ఆరోపణల్ని మేఘాలయ పోలీసులు ఖండించారు. ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు భారత్‌లో ప్రవేశించలేదని తెలిపారు.
బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మేఘాలయ ప్రజలన భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పూరి, సమీలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించారని అది కూడా పూర్తిగా అసత్య ఆరోపణలని వారు తెలిపారు


