breaking news
Rare flower
-
12 ఏళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యం!
నీలగిరులకు ఆ పేరును సార్థకం చేసిన అరుదైన, అందమైన పువ్వు నీలికురింజి. పన్నెండేళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించే ఈ పూల వెనుక ఉన్న నిజానిజాలు, వాటి జీవిత చక్రం, విశేషాల గురించిన ఆసక్తికరమైన వివరాలివి. నీలికురింజి ప్రత్యేకతలు శాస్త్రీయ నామం: స్ట్రోబిలాంథెస్ కుంతియానా జీవిత కాలం: ఈ మొక్కలు సాధారణంగా 12 సంవత్సరాలు జీవిస్తాయి. ఒకేసారి భారీ స్థాయిలో పూస్తాయి, విత్తనాలను భూమ్మీద రాల్చిన తర్వాత ఆ మొక్క మరణిస్తుంది. వ్యాప్తి: పశ్చిమకనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలలో ఇవి విస్తరించి ఉంటాయి. ముందస్తు పూతపై గందరగోళం! వాస్తవం: ఎరవికుళం నేషనల్ పార్క్‌లో 2018లో నీలికురింజి పూసింది. తర్వాతి బ్లూమింగ్ 2030లో ఉంటుందని అంచనా. అయితే మున్నార్‌లో ఈ ఆగస్టు నుంచి ఈ పూలు వికసించడంతో ఇవి కాలనియమం తప్పుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. కానీ, ప్రకృతి తన టైమ్‌టేబుల్‌ని కచ్చితంగా పాటిస్తుంది. వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలచక్రాలు: ఎరవికుళం నేషనల్ పార్క్, మున్నార్‌లోని మట్టుపెట్టి ప్రాంతాలు వేర్వేరు కాలనీలు. చోక్రముడి, మట్టుపెట్టి, కన్నెమల కొండల్లో నీలికురింజి 2014లో పూసింది, ఆ కాలనియమం ప్రకారం ఇప్పుడు సరిగ్గా పన్నెండేళ్లకు మళ్లీ వికసించాయి.ఈ ప్రకృతి చక్రం ఎలా పనిచేస్తుంది? మోనోకార్పిక్ మొక్కలు: ఇవి ప్లీటీసియల్ జీవిత చక్రాన్ని అనుసరిస్తాయి. ఒక దశాబ్దానికి పైగా పెరిగి, పరిపక్వత చెంది, తగినంత శక్తిని కూడగట్టుకుని ఒకేసారి వికసించి ఆ తర్వాత అంతరిస్తాయి. ఇదీ చదవండి: దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా స్వతంత్ర సమూహాలు: వేర్వేరు పర్వత శ్రేణులు వేర్వేరు సంవత్సరాలలో పరిపక్వం చెందుతాయి. ఉదాహరణకు, ఎరవికుళంలో పూసే కాలానికి నాలుగేళ్ల ముందు మున్నార్‌లో ఈ పూలను చూడవచ్చు. 2022లో కర్నాటకలోని చంద్రద్రోణ కొండల్లో కూడా ఇవి వికసించాయి. టూర్ ఆపరేటర్లు ఎరవికుళం షెడ్యూల్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఈ చిన్న అపోహ కలుగుతుంది. పువ్వును చూడాలి... కోయవద్దు! నీలికురింజి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కింద సంరక్షణలో ఉన్న మొక్క. వీటిని కోయడం, మొక్కను నాశనం చేయడం చట్టరీత్యా నేరం.నిబంధనలు: నిబంధనలను ఉల్లంఘించి ఈ పూలను కోస్తే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 25,000 వరకు జరిమానా, లేదా రెండూ విధించడం జరుగుతుంది. కాబట్టి వీటి సౌందర్యాన్ని కళ్లతో ఆస్వాదిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం! ఈ అరుదైన నీలికురింజి పూల అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి గతంలో పశ్చిమ కనుమల ప్రాంతాలను సందర్శించారా? ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడు చూసితీరాలి. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
‘సిక్కిం సుందరి’పై ఆనంద్ మహీంద్ర ప్రేమ, వైరల్ వీడియో
ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ‘సిక్కిం సుందరి’ పై మనసు పారేసుకున్నారు. ప్రకృతి అసాధారణ సృష్టి, అద్భుతం అంటూ దీని గురించి ట్వీట్ చేశారు. ఇంతకీ ఏవరీ సిక్కిం సుందరి తెలుసుకుందాం.అరుదైన హిమాలయ పుష్పం అసాధారణ జీవిత చక్రాన్ని హైలైట్ చేస్తూ, ఆశ్చర్యాన్ని ప్రకటించారు. సహజ అద్భుతం అంటూ ప్రశంసించారు. దానిపేరే సిక్కిం సుందరి. ఇది హిమాలయ పర్వతశ్రేణుల్లో కనిపించే అరుదైన మొక్క. దీన్ని రూమ్ నొబైల్ (Rheum nobile) అని పిలుస్తారు. దీని ప్రత్యేక రూపం కారణంగా "గ్లాస్‌హౌస్ ప్లాంట్" అని. ఇది చాలా ఎత్తులో పెరుగుతుంది ఒకేసారి పెద్దగా పూసి చనిపోతుంది. 30 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ఈ మొక్కను సిక్కిం సుందరి అంటారు. ఆనంద్ మహీంద్రా ఆదివారం అరుదైన మొక్కపై తన అభిమానాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి లోని అపూర్వ అసాధారణ సృష్టిలలో ఒకటిగా ఉన్న దీని గరించి తన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన లేదన్నారు. కఠినమైన పరిస్థితులలో ఓర్పుతో వికసించే ఈ మొక్క సహనానికి ఒక మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు. ఇది దాదాపు 3 నుండి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎత్తైన, కోన్ ఆకారంల వికసిస్తుంది ఇది ఒకేసారి పుష్పిస్తుంది, దాని విత్తనాలను వెదజల్లడంతో దాని జీవిత చక్రాన్ని పూర్తి అవుతుందని మహీంద్రా చెప్పారు. ఇలాంటి వాటికి ఎందుకు గుర్తింపు లభించడం లేదని ప్రశ్నించారు. సిక్కిం వంటి ప్రాంతాలను అన్వేషించడానికి స్థానిక జీవవైవిధ్యంతో తిరిగి కనెక్ట్ అవాలని మహీంద్రా కోరారు. I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025చదవండి: కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత? సిక్కిం, తూర్పు నేపాల్ ,ఆగ్నేయ టిబెట్‌లో సముద్ర మట్టానికి 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో ఈ మొక్క కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం అపారదర్శక, గడ్డి-రంగు బ్రాక్ట్లలతో కోన్-ఆకారపు టవర్లా ఎదుగుతాయి. ఈ బ్రాక్ట్‌లు సహజ గ్రీన్హౌస్ లాగా పనిచేస్తాయి. సూర్యరశ్మి గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ, ఎండ, చల్లగాలులనుంచి సున్నితమైన పువ్వులను కాపాడుతుంది. ఇది లోపల వెచ్చని మైక్రోక్లైమేట్ను సృష్టిస్తుంది. అధిక ఎత్తులో మొక్క మనుగడకు సహాయపడుతుంది. అలాగే దాని ఎత్తు, లేత రంగు కారణంగా, మొక్క పర్వత లోయల మీదుగా అందంగా స్పష్టంగా కనిపిస్తుంది.సాంస్కృతిక, ఔషధ ప్రాముఖ్యతఅయితే దీని రూపం, ఆకర్షణతో పాటు సిక్కిం సుందరికి సాంస్కృతిక, ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్థానికంగా చుకా అని పిలుచుకునే దీని కాండాన్ని సాంప్రదాయ వంటలలో వండుకుని తింటారు. దీని ప్రకాశవంతమైన పసుపు వేర్లు సాంప్రదాయ టిబెటన్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా జూన్ , జూలై మధ్య పుష్పిస్తుంది, ఇది ఎత్తైన హిమాలయాలలో సీజనల్ హైలైట్‌గా నిలుస్తుంది.సింగిల్ బ్లూమ్ మొక్క చనిపోయి, దశాబ్దాల వరకు ఆ విత్తనం అలాగే పదిలంగా ఉంటూ, మళ్లీ మొలకెత్తడమే దీని ప్రత్యేకత. ఇదీ చదవండి: కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి -
ఈ పువ్వులు 12 ఏళ్లకు ఓసారి వికసిస్తాయి.. ఎక్కడో తెలుసా?
Neelakurinji Flowering Facts: ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ప్రశాంతంగా ఉంటే అంత అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని గడ్డి, పరవశించే పైర గాలి, ఆదమరపించే చెట్లు, అందమైన పూలు. చేతితో తాకవచ్చు అనిపించే మేఘాలు.. ఆ ఊహ ఎంత అందంగా ఉంటుంది. అదే నిజమైతే ఒళ్లు పులకించి, ఆనంద తాండవం చేయని మనిషి ఉండడు. తిరువనంతపురం: కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో పూసిని పువ్వులు నేలపై బ్లూ కార్పెట్‌ను పరిచినట్టు వికసించాయి. 12 ఏళ్లకు ఓసారి వికసించే నీలకురింజి పువ్వులు అక్కడకి వచ్చిన పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. ఈ సీజన్లో సేకరించిన తేనెకు యమ గిరాకీ..! స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగిన నీలకురింజి పువ్వులు జూలై-అక్టోబర్ మధ్యలో వికసిస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో ‘నీలి పువ్వు’ అని అర్థం. నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలా కాలం అవసరం. అందువల్ల ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృక్షశాస్త్రంలో, దీనిని మొక్కల‘‘సర్వైవల్ మెకనిజమ్(మనుగడ విధానం) గా సూచిస్తారు. పక్షులు, గడ్డి తినే క్షీరదాల నుంచి నీలకురింజి పువ్వులకు పెద్ద ముప్పు ఉంది. దాంతో అవి వికసించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏఎన్ఐ ఇటీవల సంతన్పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు గాలికి ఊగుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక నీలకురింజి పువ్వులు వికసించే ఈ సీజన్లో సేకరించే తేనె రుచి, పోషకాహార అంశాలలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. దీంతో ఈ సీజన్లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా, ప్రపంచంలో 250 జాతుల పువ్వులలో 46 భారతదేశంలో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో వికసిస్తాయి. ఇక కోవిడ్-19 మహమ్మారి వల్ల పర్యాటకుల తాకిడి చాలా తగ్గింది. #WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv — ANI (@ANI) August 2, 2021 -
బ్రహ్మకమలం విరబూసింది
సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం హిందూపూర్ లోని ఓ ఇంట్లో విరబూసింది. అనంతపురం జిల్లా హిందూపురంలోని డీబీ కాలనీలోని ద్వారకానాథ్ రెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మ కమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. ఈ క్రమంలో శనివారం బ్రమ్మ కమలం పువ్వు వికసించింది. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హిమాలయాల్లో దొరికే.. ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తారు. -
రాకాసి పువ్వు
తిరుపతి తుడా: తిరుమల శేషాచల కొండల్లో అరుదైన పుష్పం దర్శనమిస్తోంది. ప్రపంచ దేశాల్లో కేవలం మూడు రకాల పుష్పాలు మాత్రమే మాంసహారంతో జీవిస్తాయని తెలుస్తోంది. అందులో ఒకటి శేషాచల అడవుల్లో ఉండటం గమనార్హం. ఎస్వీ యూ బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవశెట్టి వీటిపై పరిశోధన చేస్తున్నారు. రంగులతో అందంగా .. శేషాచలం కొండల్లో పెరుగుతున్న సన్‌డ్యూ ప్లాంట్ డ్రాసిరేసి జాతికి చెందినది మెగ్గ. డ్రాసిరా బర్మానై శాస్త్రీయ నామం. తెలుగులో బ్యాడ్ సుందరి, సీమకుట్టు, బురద బూచి, బురద సుందరి, కవారమొగ్గ పేర్లు ఉన్నాయి. శేషాచల కొండల్లో బురద, నీరు ప్రవహించే ప్రంతాల్లో పెరుగుతున్నాయి. భూమికి రెండు, మూడు అంగుళాల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. లేత గులాబీతో ఆకుపచ్చ రంగు మిళితమై ఉంటుంది. పువ్వుకు నాలుగు లేక ఐదు రేకులు ఉంటాయి. ఒక్కో రేకుపై వందల్లో గ్లాండ్ టిప్డ్ హేర్స్ ఉంటాయి. ఈ హేర్స్ చివరిలో బుడుపుగా ఉండాయి. సూర్యోదయం సమయంలో ఈ హేర్స్ బుడుపుల్లోంచి విడుదలయ్యే ద్రవ పదార్థాంపై సూర్య కిరణాలు పడ్డప్పుడు రంగు మరింత అందంగా మారి మెరుస్తాయి. ఆకర్షించి .. కరిగించి పువ్వు రేకులపై ఉండే గ్లాండ్ టిప్డ్ హేర్స్ నుంచి జిగడ పదార్థం ( హైడ్రోక్లోరిక్ యాసిడ్) విడుదల అవుతుంది. సూర్య కిరణాలకు అందంగా మెరుస్తూ సూక్ష్మ జీవులను ఆకర్షిస్తాయి. చిన్న పురుగులు, సూక్ష్మజీవులు రేకులపై వాలగానే జిగడలో చిక్కుకుంటాయి. ఒక్కో హేర్ నుంచి 10 మిల్లీ లీటర్ల జిగడ ద్రవం విడుదలై పువ్వు రేకులు ముడుచుకుంటాయి. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో మరిగి సూక్ష్మజీవులు కరిగిపోతాయి. తరువాత వాటిని పువ్వులు ఆహారంగా తీసుకుంటాయి. ఇలా రోజుకు ఒక్కో పువ్వు సుమారుగా 700 పురుగులు, సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకుంటాయి. ఔషధంగా కూడా.. ఈ మొక్కకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. పువ్వు రేకులను ఎండబెట్టి పొడి చేసి శరీరానికి పూసుకుంటే ఇరిటేషన్, ర్యాష్‌లు పోతాయి. చాలా అరుదుగా కనిపిస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. - డాక్టర్ కె.మాధవశెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్రం, ఎస్వీయూ


