అమెరికాలో ఆరోగ్యం అస్తవ్యస్తం : మస్క్ కీలక ఉద్యోగి ట్వీట్ వైరల్
ఇంత దారుణంగా ఉందా దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఇండియాకొచ్చి, చికిత్స్ తీసుకొని హాయిగా మూడు రోజుల్లో వెళ్లిపోండి!
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధీనంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని ఒక ప్రధాన ఉద్యోగి ట్వీట్ వైరల్‌గా మారింది. అమెరికాలో H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా మెడికల్ డెసర్ట్‌లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆధీనంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొడక్షన్ హెడ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఎక్స్ ప్రొడక్షన్ హెడ్ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్ ద్వారా ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్రైడ్ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.
ఎండోస్కోపీ పరీక్షకోసం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని చెప్పడంతో షాక్ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.
అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థకు సంబంధించి అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు. వీటి కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా చాలా జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.
హాయిగా ఇండియా ట్రిప్ వేయండి!
మరోవైపు బియర్‌ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్ డాక్టర్‌ని కన్‌సల్ట్ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు. సత్వర చికిత్స కోసం బియర్‌ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్‌లాండ్‌కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.
(అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?)
వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు. ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.
ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!


