చర్ల/సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్‌జీ, ఎస్టీఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈక్రమంలో బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోతుండగా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, అతన్ని ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు పడ్నీ మడవిగా గుర్తించారు.
41 మంది మావోల లొంగుబాటు
మావోయిస్టు పార్టీ కొమురంభీం ఆసిఫాబాద్–మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ , పార్టీ సభ్యుడు చెందిన కనికారపు ప్రభంజన్ (మంచిర్యాల జిల్లా) సహా మొత్తం 41 మంది మావోయిస్టులు శుక్రవారం డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు.


