
చత్తీస్‌గఢ్: తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోఆయరు.
ఈరోజు(శుక్రవారం,. జూలై 11) నారాయణపూర్ ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 22 మంది మాదోయిస్టుల్లో 8 మంది మహిళలున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 37 లక్షల రివార్డ్ ఉంది.
కాగా, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. గత నెలలో కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఏడు నెలల్లో 310కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.
మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు.. వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతోపాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.
భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చాక కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురుకాల్పుల్లో ఈ తరహా వ్యూహాలనే ఎక్కువగా అమలు చేసినట్టు సమాచారం. ఇదే మాదిరి మడావి హిడ్మా, బార్సే దేవా విషయంలోనూ పది రోజుల కిందట ఆపరేషన్ మొదలైనట్టు తెలుస్తోంది.