ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి | Six Maoists Died in encounter in Chhattisgarhs Narayanpur | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి

Jul 18 2025 7:21 PM | Updated on Jul 18 2025 8:51 PM

Six  Maoists Died in encounter in Chhattisgarhs Narayanpur

చత్తీస్‌గడ్‌: భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడానికి యత్నించారు. అబుజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.  

ఈ రోజు(శుక్రవారం, జూలై 18) మధ్యాహ్న సమయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.. పలుమార్లు జరిగిన ఎదురుకాల‍్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.

మావోయిస్టుల వేరివేతే లక్ష్యంగా భదత్రా బలగాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టులు లొంగిపోవడం ఒకటైతే, ఇంకోటి ఏరివేతే అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించలేదు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులనే ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఆపరేషన్ల పేరుతో మావోయిస్టుల ఉన్న ఏరియాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement