సాక్షి,హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా స్థానంలో నియమించిన బార్సెదేవ అరెస్టు అయినట్లు తెలుస్తోంది. బార్సెదేవను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది
దండకారణ్యంలో పార్టీని దూకుడుగా నడిపించిన మావోయిస్టు టాప్ కమాండర్ మడావి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ సాగింది. హిడ్మాకు సహచరుడు, ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సె దేవాను ఈ కీలక స్థానంలో నియమితులయ్యారు. తాజాగా బార్సెదేవను సైతం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.


