breaking news
Madvi Hidma
-
ప్రభుత్వం మాటలు విని మోసపోయా: హిడ్మా తల్లి
కొన్నాళ్ల క్రితం వరకు ఎక్కువ మంది నోట వినిపించిన పేరు మడ్వి హిడ్మా. ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాను అభినవ భగత్‌సింగ్ అని, మరో అల్లూరి సీతారామరాజు అంటూ కొందరు కీర్తించగా.. హిడ్మా పేరిట ఉన్న క్రైం రికార్డుల మాటేమిటని మరికొందరు ప్రశి్నస్తున్నారు. కానీ ఇరువర్గాలను తల్లడిల్లిపోయేలా చేస్తోన్న ఒకే అంశం హిడ్మా తల్లి పొజ్జి. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ ఆమెను కలిసినప్పుడు తొలిసారిగా పొజ్జి వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత హిడ్మా అంత్యక్రియల సమయంలో ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన వారి మనుసులు బరువెక్కాయి. ఇప్పుడా పొజ్జి ఎలా ఉంది.. ఏం చేస్తోందని పలువురు ఆరా తీస్తుండగా ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పూవర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఓయ్ పారా అనే చిన్న పల్లెలో ఊరికి చివరగా అడవికి దగ్గరగా పాకలో మడ్వి పొజ్జి నివసిస్తోంది. ఆ పాకలో తిండి గింజలు దాచుకునేందుకు వీలుగా చుట్టూ కర్రలతో కట్టిన ఒక గది ఉంది. ఆ గదికి ఉన్న కర్ర తలుపులు జంతువులు లోపలికి పోకుండా తాళ్లతో కట్టి ఉన్నాయి. తాళం కూడా లేని ఇంట్లో ఆమె జీవిస్తోంది. గోండి భాషలో ఆమె చెప్పిన విషయాలను అక్కడ తెలుగు తెలిసిన మరో ఆదివాసీ యువకుడు తర్జుమా చేసి చెప్పిన వివరాల ఆధారంగా... ‘నా కొడుకు ఉన్నప్పుడు ఎవరూ ఇటు రాలేదు.ఇవన్నీ నాకెందుకు ? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కొందరు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నారు. ఇంకొందరు డబ్బులు ఇస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా, దాచమని నీ కొడుకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు అని అడుగుతున్నారు. వాడు (హిడ్మా) పార్టీలోకి వెళ్లిన తర్వాత నన్ను కలిసింది తక్కువ. మాట్లాడింది తక్కువ. నాకు వాడు ఇచ్చిన, మీరు ఇచ్చినా... అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? అసలు వాటితో నాకు ఏం అవసరం ఉంది’అంటూ పూవర్తిపైకి దండెత్తి వస్తున్న మీడియా బృందాలపై పొజ్జి కోప్పడింది. ఆయన మాటలు నమ్మాను‘ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ మా ఊరికి వచ్చాడు. మాతో మాట్లాడాడు. మాతో కలిసి అన్నం తిన్నాడు. ‘నీ కొడుకును లొంగిపొమ్మని చెప్పమ్మా’అని అడిగాడు. ‘వాడు నా మాట వినడయ్యా.. జనం కోసమని పోయిండు, నేను రమ్మంటే రాడు’అని చెప్పిన. ‘లేదమ్మా! మేము చెబితే అతను రావడం లేదు. నీ కొడుకు నీ మాట వింటాడు, నువ్వు చెబితే తప్పకుండా వస్తాడు. ఒక్కసారి అజ్ఞాత జీవితం వదలి రమ్మని అతనికి నువ్వు చెప్పు’అని అడిగాడు. అంత పెద్దమనిషి మా ఊరికి వచ్చి అడుగుతున్నాడు కదా అని మనసులో ఇష్టం లేకపోయినా లొంగిపో కొడుకా అని చెప్పాను. (హిడ్మాను లొంగిపొమ్మంటూ ఆమె చెబుతున్నట్టుగా వీడియోను గతంలో షూట్ చేసి రిలీజ్ చేశారు). ఆయన (విజయ్ శర్మ) మాటల మీద నమ్మకం ఉంచుకున్న.నా కొడుకు లొంగిపోయి ఇంటికి వస్తాడని ఆశలు పెట్టుకున్న. కానీ కొన్ని రోజులకే నా కొడుకును శవంగా మార్చి ఇంటికి పంపారు. ఆ రోజు (విజయ్ శర్మ పూవర్తికి వచ్చిన రోజు)న జరిగింది గుర్తుకు వస్తేనే అంటూ చెప్పే ప్రయత్నంలో ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. మాటలు ఆగిపోయాయి, కానీ కన్నీళ్లు ఆగలేదు. కొద్ది సేపటికే దుఃఖం నుంచి తేరుకుంది. చేతిలో కొడవలి పట్టుకొని, నాకు పని ఉంది అంటూ ఆమె నివసిస్తున్న పాకను ఆనుకొని ఉన్న పొలం వైపు అడుగులు వేసుకుంటూ సమీపంలోని అడవిలోకి పొజ్జి వెళ్లింది.:::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. మడావి హిడ్మాని స్పెషల్ ఆపరేషన్‌లో పట్టుకోలేదని.. పక్కా సమాచారంతో పట్టుకుని దారుణంగా హత్య చేశారని ఓ లేఖ విడుదల చేసింది. అంతేకాదు.. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పడన్నది అవాస్తవం. అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. వీళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం. హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు. ఈ హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లని కట్టు కథలు అల్లారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకం. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాం’’ అని వికల్ప్ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. -
హిడ్మా మరణంలో ద్రోహులు వారే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, శంకర్ హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్ష విధించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గతనెల 27న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. హిడ్మా హత్యకు దేవ్‌జీ కార ణమంటూ మనీశ్ కుంజాం, సోనీసోరి చేసిన ఆరో పణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్టీ పేర్కొంది. ఆ లేఖలోని ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి.పోలీసులు పట్టుకొని హత్య చేశారు ‘విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారిని నమ్మిన హిడ్మా, చికిత్స కోసం అక్కడకు అక్టోబర్ 27న వెళ్లాడు. ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకు చేరారు. నిరాయుధులైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు పట్టుకొని హత్య చేశారు. ఆ తర్వాత ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తప్పుడు కథ అల్లారు. నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలోనూ నిరాయుధులైన ఏఓబీ (ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడు శంకర్, మరో ఆరుగురిని పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. బయటకు తీసుకెళ్లిన వ్యక్తులే...నవంబర్ 9న మా బలగాల నుంచి కోసల్ అనే సభ్యుడు పారిపోయాడు. నేరుగా వెళ్లి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. ఆయనకు హిడ్మా ప్రయాణ వివరాలన్నీ తెలుసు. వెంటనే అడవిలోకి వచ్చేయాలని పార్టీ తరఫున హిడ్మాకు సమాచారం ఇచ్చాం. ఈ సమాచారం ఆయనకు నవంబర్ 14న మధ్యాహ్నం అందింది. ఆ వెంటనే అడవిలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడు.అదేరోజు సాయంత్రం 4–5 గంటల సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారంతా పోలీసుల చేతిలో చనిపోయారు. మరో మావోయిస్టు నేత శంకర్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, విజయవాడలోని కలప ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్లు 50 మంది మావోయిస్టుల అరెస్ట్‌కు కారణం. వీరే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. ఫలితంగా ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులు పట్టుబట్టారు. ఈ వ్యవహారమంతా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. న్యాయ విచారణ చేయాలిఈ మొత్తం కుట్ర వెనుక ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం స్పష్టంగా తెలుస్తోంది. హిడ్మా, శంకర్‌తోపాటు మొత్తం 13 మందిని అరెస్టు చేసి నకిలీ ఎకౌంటర్లు సృష్టించారు. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద అధికారులు బాధ్యులు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి విదేశీ కాపలాదారులు కూడా సహకరించారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలి. కుట్రలో భాగమేఏపీలో అరెస్ట్ అయిన వారిలో దేవ్‌జీ, సంగ్రామ్ లేరని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. కానీ హిడ్మా మరణానికి దేవ్‌జీ కారణం అనే ప్రచారం జరగడం, దానికి సోని సోరి, మనీశ్ కుంజమ్ లాంటి నేతలు వంత పాపడటం రాజ్యం పన్నిన కుట్రలో భాగమే’అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆ లేఖలో వెల్లడించింది. -
మావోయిస్టు పార్టీకి బిగ్‌షాక్.. దేవన్న లొంగుబాటు?!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగలనుందనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత, పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోబోతున్నట్లు ప్రచారం ఉధృతంగా నడుస్తోంది. తన దళం.. భారీగా ఆయుధాలతో సహా ఆయన లొంగిపోతారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.ఆపరేషన్ కగార్‌లో.. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మోస్ట్‌వాంటెడ్ మడివి హిడ్మా కిందటి నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలను దేవన్న స్వీకరించారనే ప్రచారం ఒకటి ఉంది. అయితే దండకారణ్యంలో తీవ్ర నిర్బంధాన్ని ఆయన దళం భరించలేకపోతోందన్నది ఆ ప్రచార సారాంశం. ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం.. ఎన్కౌంటర్లలో మరణించడం.. జనవరి 1వ తేదీన భారీ సంఖ్యలో లొంగుబాటులు ఉంటాయని మావోయిస్టు నాయకత్వం నుంచి ప్రకటన వెలువడడం.. తదితర పరిస్థితుల నడుమ దేవన్న సైతం లొంగిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బార్సే దేవా స్వస్థలం సుక్మా జిల్లా( ఛత్తీస్‌గఢ్) పూవర్తి గ్రామం. హిడ్మా దేవన్నలది ఒకే ఊరు.. పక్కపక్కనే నివాసాలు కూడా!. హిడ్మా, దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంటే పోరాటబాటలో నడిచాడు దేవన్న. 2017లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో పీఎల్జీఏ నెంబర్ -1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యాలలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్. అప్పటి నుంచి ఈ గ్రూప్‌తో పలు దాడులకు నాయకత్వం వహించాడు దేవన్న. ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత ప్రైజ్‌మనీ ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా కేంద్ర _రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. ఓ పక్క నేటి నుంచి పీఎల్జీఏ 25 వ వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ.. బార్సే దేవా లొంగుబాటు గనుక నిజమైతే మావోయిస్టు పార్టీకి ఇక ఏమాత్రం కోలుకోలేని దెబ్బ అనే చెప్పొచ్చు. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు దిగారు. ఈ నిరసనల్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫొటోలు, ఆయన అనుకూల నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణంగా పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదివారం పలువురు.. ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుకూల వ్యాఖ్యలతో ప్లకార్డులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. నిరసనకారులు.. బిర్సా ముండా నుండి మాద్వి హిద్మా వరకు మన అడవులు, పర్యావరణపై పోరాటం కొనసాగింది. మన బిడ్డలను మనమే చంపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాటం కొనసాగుతుంది. రెడ్ సెల్యూట్ టూ హిడ్మా.. అమర్ రహే అంటూ పోస్టర్‌ను ప్రదర్శించి నినాదాలు చేశారు.Protesters against Air Pollution in Delhi suddenly started raising slogans in support of Indian Naxalite Hidma; says "Long live Comrade Hidma"Delhi's air quality hit severe levels Sunday, with AQI around 400, prompting hybrid school classes and health alerts for vulnerable… pic.twitter.com/7cg6aeTRc1— Sujal Singh (@sujalsingh_x) November 23, 2025ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకోగా నిరసనకారులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు పెప్పర్‌స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులు.. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #WATCH | Delhi: A group of protesters holds a protest at India Gate over air pollution in Delhi-NCR. They were later removed from the spot by police personnel pic.twitter.com/DBEZTeET0U— ANI (@ANI) November 23, 2025 -
పువర్తిలో హిడ్మా స్మారక స్తూపం?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా సొంతూరైన పువర్తిలో స్మారక స్తూపం నిర్మించేందుకు బస్తర్ ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ స్మారక స్తూపం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా చేయాలంటూ మీడియా ప్రతిని«ధులు, ప్రజాసంఘాలను వారు కోరుతున్నారు. హిడ్మా అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్థానిక ఆదివాసీలు తమ వివరాలు గోప్యంగా ఉంచాలనే షరతుపై ఓ యూట్యూబ్ చానల్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మా ఆదివాసీల కోసం హిడ్మా ఎంతో చేశాడు. అతడిని ఎదుర్కొనేందుకే ప్రభుత్వాలు మా ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన రోడ్లు, వంతెనలు, కరెంటు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు అతడు చనిపోయాడు కదా అని ఆ అభివృద్ధి పనులను మధ్యలో ఆపొద్దు. వాటిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా నాయకుడికి గుర్తుగా స్మారక స్తూపం నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. ఈ మేరకు అవసరమైన సహకారాన్ని సమాజం నుంచి ఆశిస్తున్నాం’అని వారు వెల్లడించారు. దేవాను చంపకండి: ‘హిడ్మా అంత్యక్రియల సందర్భంగా అతని మృతదేహాన్ని పరిశీలిస్తే తూటా గాయాల కంటే కత్తితో చేసిన గాయాలే ఎక్కువగా శరీరంపై ఉన్నాయి. ఎన్కౌంటర్లో చనిపోతే ఇలా జరగదు కదా. గతంలో నిరాయుధులుగా జవాన్లు దొరికితే, హిడ్మా బందీలుగా తీసుకున్నాడే తప్ప ఎప్పుడూ వారికి ప్రాణ హాని తలపెట్టలేదు. ప్రజాకోర్టులో చర్చలు జరిపి గౌరవంగానే వారిని విడిచిపెట్టా డు. మా గ్రామం నుంచి బార్సే దేవా ఇంకా పారీ్టలోనే ఉన్నాడు. లొంగిపోవడానికి వస్తే దయచేసి చంపొద్దు. అతడిని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, జీవితాంతం జైల్లో ఉంచండి’అని పువర్తిలో ఉన్న ఆదివాసీలు ప్రభుత్వాలను కోరుతున్నారు. -
ఎన్కౌంటర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరొక నలుగురు సహచరులతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస దగ్గర అడవుల్లో నవంబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని పోలీ సులు ప్రకటించారు. ఉద్యమ జీవితంలో హిడ్మా కార్యకలాపాలపై చర్చ జరుగు తున్నది. హిడ్మా అంతంతో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొన్ని సామా జిక పరిణామాలకు అంతం ఉండదు. ఒక రూపంలో అంతమైనదను కున్నది మరొక రూపంలో ప్రారంభమవుతుంది. ఒక అంతం అనేక ప్రశ్నలను లేవనెత్తి కొత్త ప్రారంభాలకు దారి తీస్తుంది. ఉద్దేశపూర్వక హత్యమొట్టమొదటి ప్రశ్న. అది నిజమైన ఎన్‌కౌంటరేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో 1969లో మొదలైన ఎన్కౌంటర్ కథనాల్లో నూటికి తొంభైæ అబద్ధాలని ఇప్పటికే సమాజానికి తేటతెల్లమ యింది. ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా ఎదురుపడటం అనే భాషాపరమైన అర్థాన్ని తలకిందులు చేసి, పట్టుకొని ఉద్దేశపూర్వ కంగా చంపడం అనే అర్థాన్ని పోలీసులు స్థిరపరిచారు. ‘ఎన్కౌంటర్ చేస్తాం’ అని పోలీసులే అనడం, కొన్ని సందర్భాలలో బాధితులు కూడా ‘నేరస్థులను’ ఎన్కౌంటర్ చేయమని కోరడం చూస్తే ఆ మాట సంతరించుకున్న కొత్త అర్థం స్పష్టమవుతుంది.ఛత్తీస్‌గఢ్‌లో 2024 జనవరి 1న మొదలై వరుసగా కొనసాగు తున్న మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమం నుంచి తప్పించుకోవ డానికి, లేదా ఆరోగ్య కారణాల కోసం కొందరు మావోయిస్టులు ఇతర చోట్ల తలదాచుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో విజయ వాడతో సహా కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు జరిగాయి. అందులో భాగంగానే హిడ్మానూ, ఇతరులనూ పట్టుకుని, వారిని రెండు విడతలుగా కాల్చి చంపారని బలమైన అనుమానాలున్నాయి.‘హిడ్మా లొంగిపోయినా వదలం, చంపుతాం’ అని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు గతంలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు, పోలీసు అధికారులు హిడ్మా పేరు పెట్టి మరీ హెచ్చ రికలు జారీ చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు స్వయంగా హిడ్మా తన చేతులతో జరిపినట్టు కథనాలు ప్రచారంలో పెట్టారు. వ్యవస్థ మార్పునకు సాయుధ పోరాటం అనివార్యమనే విశ్వాసంతో, దీర్ఘ కాలిక ప్రజాయుద్ధం జరుపుతున్న, సమష్టి నిర్ణయాలతో నడిచే ఒక పార్టీ నాయకత్వంలో జరిగిన ఘటనలను అలా ఒక వ్యక్తికి కుదించడం, ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి, ఎప్పుడైనా భవి ష్యత్తులో ఆయనను చంపితే సమర్థన సమకూర్చుకోవడానికి మాత్రమే! అందువల్ల హిడ్మాది నిజమైన ఎన్కౌంటర్ కన్నా ఎక్కు వగా ఉద్దేశపూర్వక హత్య కావడానికే అవకాశం ఉంది. దేశ ప్రజల సమస్యరెండో ప్రశ్న. మరి అలా పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ప్రత్యేకించి అందులోని అధికరణం 21 పేర్కొన్న జీవించే స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంటే ఆ అధికారం ఉండదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా మనిషి ప్రాణాలు తీసే హక్కు రాజ్యానికి లేదని, పౌరులందరికీ జీవించే హక్కు ఉందని చెప్పే ఆ అధికరణాన్ని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉల్లంఘి స్తూనే ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి, సహేతుకమైన సందేహాలకు తావులేని రీతిలో శిక్ష విధించడం. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, విచా రణ లేదు, సహేతుకమైన సందేహాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శిక్ష, అదీ తిరిగి మార్చడానికి వీలులేని మరణశిక్ష మాత్రం అమలైంది.మూడో ప్రశ్న. హిడ్మా మీద ప్రత్యేకంగా, ఆదివాసుల మీద మొత్తంగా ఈ దాడి ఎందుకు? సుక్మా జిల్లా మారుమూల గ్రామం పువ్వర్తిలో పుట్టి పెరిగిన ఆదివాసి యువకుడు హిడ్మా మీద ఎక్కు పెట్టిన ఈ దాడి, గతం నుంచీ ఆదివాసుల మీద మొత్తంగా సాగు తున్న దాడులలో భాగమే. దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పథకంలో భాగంగా, పాలకులు ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, వారి ఆవాసాల నుంచి బేదఖలు చేయదలచు కున్నారు. ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, అడవిలో, కొండల్లో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్నది. దానికి అడ్డుగా ఉన్నారనే హిడ్మాను, జల్ జంగల్ జమీన్ ఆకాంక్షను, విప్లవోద్య మాన్ని నిర్మూలించదలచారు. అంటే ఇది ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో కాదు, ఈ దేశ ప్రజల సమస్య, ఈ దేశ భవిష్యత్తు సమస్య. పోరాట ధార ఆగేదా?నాలుగో ప్రశ్న. హిడ్మా విషయంలో ప్రభుత్వ ప్రచారం గెలి చిందా, ఓడిందా? హిడ్మాను ఎంత భయంకరుడిగా చూపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వచ్చినా, ఆయన హత్య తర్వాత వెల్లు వెత్తుతున్న నిరసన, పువ్వర్తిలో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై ఘన నివాళి అర్పించడం ఆయన ఆదివాసుల హృద యాల్లో ఎటువంటి స్థానం సంపాదించాడో చూపుతున్నది. ఆదివా సుల గూడాలు తగుల బెడుతూ, విచ్చలవిడిగా హత్యలు, అత్యాచా రాలు చేసిన సాల్వా జుడుమ్ దుర్మార్గాన్ని క్రియాశీలంగా ఎదు ర్కొన్న నాయకులలో ఒకరుగా ఆదివాసులలో ఆయనకు చెరగని స్థానం ఉంది. దాదాపుగా అన్ని ఆదివాసీ సమూహాల భాషలూ ధారాళంగా మాట్లాడుతూ వారికి తలలో నాలుక అయ్యాడు గనుక ఆయన పట్ల అపార గౌరవం ఉంది.ఐదో ప్రశ్న. హిడ్మా అంతంతో ఉద్యమం అంతమవుతుందా? ఆదివాసులకు నవంబర్ 18 వరకూ సజీవంగా నాయకత్వం వహించిన మాడ్వి హిడ్మా, ఆనాటి నుంచీ వందలాది ఆదివాసీ అమర పోరాట యోధుల చారిత్రక జాబితాలో చేరాడు. కానూ, సిద్ధూ, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రాంజీ గోండు, గుండాధుర్, కొమురం భీమ్ వంటి ఉత్తేజకర, స్ఫూర్తి దాయక జాబితా అది. వాళ్లకు, వాళ్ల స్ఫూర్తికి మరణం లేదు. మొదట బ్రిటిష్ వలసవాదుల మీద, మైదాన ప్రాంతాల దోపిడీదారుల మీద, భూస్వాముల మీద, ఆ తర్వాత ‘అభివృద్ధి’ పేరుతో జల్ జంగల్ జమీన్ కొల్లగొట్టి తమను నిర్వాసితులను చేసిన ప్రభుత్వాల మీద ఆదివాసుల పోరాటాలు మూడు శతాబ్దాలుగా జరుగుతున్నాయి. దోపిడీ, పీడనలు ఉన్నంతవరకూ ఆ పోరాట ధారకు అంతం ఉండదు. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు – ‘వీక్షణం’ ఎడిటర్ -
హిడ్మా ఫ్లెక్సీల కలకలం
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామంలో మావోయి స్టు పార్టీ అగ్రనేత మడ్వి హిడ్మా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన కొయ్యడ సురేశ్, మ్యాక బుచ్చయ్య స్థానిక ప్రధాన రహదారి వెంట చర్చి గోడలకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక హిడ్మా ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ‘ఓ వీరుడా.. నువ్వు కన్న కల దోపిడీలేని స్వేచ్ఛా దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. పీడిత జనాల స్వేచ్ఛా పోరాటానికి నీవు నిత్యం రణభేరి నినాదం. జనతన సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. నీ పోరాటం అమరం. లాల్ సలాం కామ్రేడ్’అని రాయించి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గ్రామానికి వెళ్లి ఫ్లెక్సీని తొలగించారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
కథ ముగిసింది... కల చెదిరింది...
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతితో విప్లవ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలముకుంది. రాజ్యాంగ పరిధిలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కగార్‌ను ఆపేయాలంటూ లేఖ విడుదల చేశాయి. సాయుధ పోరాటం మరో కొత్త రూపం తీసుకుంటుందని చెబుతూ.. రాబోయే మార్పునకు ముందస్తు సంకేతాలను విప్లవ శ్రేణులు అందిస్తున్నాయి. ఇదే సమయాన హిడ్మా మరణంతో దేశంలో మావోయిస్టులది ముగిసిన అధ్యాయమేనంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కగార్ మొదలయ్యాక జరిగిన నష్టాలన్నీ ఒక ఎత్తయితే.. హిడ్మా మరణం మరో ఎత్తు అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.మీడియాకు హాట్ టాపిక్హిడ్మాకు ముందు తరం మావోయిస్టులు.. పోలీసులు, అటవీ శాఖతోనే ఎక్కువగా పోరాడగా, ఏకంగా పారా మిలిటరీ సైన్యానికే సవాల్ విసిరిన చరిత్ర హిడ్మాది. అంబూష్ దాడులు చేసి జవాన్లనే బందీలుగా పట్టుకున్న తీరు ఇప్పటికీ ఆశ్చర్యకరమే. ఈ బందీలను విడిపించేందుకు మరోసారి అడవిలోకి వెళ్లే సాహసం పారా మిలిటరీ బలగాలే చేసేవి కావు. మీడియా ప్రతినిధుల ద్వారానే బందీలను విడిపించుకునేవి. అందుకే మీడియా వర్గాలకు హిడ్మా ఒక హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో టాస్క్‌ఫోర్స్, జాయింట్ టాస్క్‌ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా వంటి ప్రత్యేక దళాల అవసరం పడింది. బీఎస్ఎఫ్, ఐటీబీటీల వంటి మిలిటరీ విభాగాలను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా పట్టు దొరక్క.. మాజీ మావోయిస్టులతో ఏర్పడిన డీఆర్జీ వంటి లోకల్ దళాలు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో భాగమయ్యాయి.మిలిటరీ అయినా జాగ్రత్తలు తప్పలేదుహిడ్మా నేతృత్వాన చేసిన దాడులతోనే పీఎల్జీఏకు భారీ ఎత్తున ఆధునిక ఆయుధాలు సమకూరాయి. ఆయన అండతోనే దక్షిణ బస్తర్ సబ్‌జోన్‌గా పేర్కొనే సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జనతన సర్కార్లు ఏర్పాటయ్యాయి. ఈ సర్కార్లను నిర్వీర్యం చేసేందుకు జోన్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంపు వంతున ఏర్పాటు వ్యూహాన్ని బలగాలు అమలు చేశాయి. అయితే, దేశంలో మిగిలిన క్యాంప్‌లతో పోలిస్తే అత్యంత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతీ క్యాంపు చుట్టూ ప్రహరీ, అవతల ట్రెంచ్‌తో పాటు మూడు వరుసల ముళ్ల కంచెలు ఉంటాయి. ప్రతీ క్యాంప్ చుట్టూ నలువైపులా రెండు ఎకరాలకు విస్తీర్ణానికి తగ్గకుండా చుట్టూ దట్టంగా ఉన్న అడవిని నరికి మైదాన ప్రాంతంలా మార్చి, నలువైపులా రాత్రి పూట స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశారు. రాకెట్ లాంచర్లతో దాడి జరిగితే నష్టాన్ని తగ్గించేందుకు వీలుగా క్యాంప్‌లో ఉండే రేకుల షెడ్డు బ్యారక్‌లపైన ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. రాత్రివేళ దాడులను అరికట్టేందుకు ఆకాశంలో వెలుతురు విరజిమ్మే ఫ్లవర్ బాంబులను అందుబాటులో పెట్టారు. దాడుల్లో గాయపడిన జవాన్లకు సత్వర వైద్యసాయం అందించేందుకు వీలుగా ప్రతీ క్యాంప్‌లో ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతోనే కూంబింగ్‌లు చేపట్టారు. మందుపాతరలను కనిపెట్టేందుకు స్నైపర్ డాగ్స్‌ను కూంబింగ్‌లో తోడుగా తీసుకెళ్తున్నారు.మావో బాటలో గెరిల్లా వార్మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణం, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు ఆయుధాలతో సహా లొంగిపోగా.. మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఏకంగా 210 మంది అనుచరులతో అడవిని వీడాడు. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా విప్లవ శ్రేణుల్లో ఆశలు కొడిగట్టిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం మడ్వి హిడ్మా. ఆయన ఉంటే చాలు సాయుధ పోరాటం మళ్లీ గాడిన పడుతుందనే నమ్మకం వారిలో ఉండేది. మార్క్స్, లెనిన్ తదితర విప్లవ గురువులు చెప్పిన కమ్యూనిజం గురించి హిడ్మాకు పెద్దగా తెలియదంటూ మాజీ మావోలు, ఛత్తీస్‌గఢ్ పోలీస్ బాస్‌లు, స్థానిక ఆదివాసీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అయినప్పటికీ హిడ్మాపై విప్లవకారులు నమ్మకం కోల్పోలేదు. ఎందుకంటే మావో సేటూంగ్ చూపిన గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలుచేస్తూ సాయుధ పోరాటాన్ని దండకారణ్యంలో మరో ఎత్తులకు తీసుకెళ్లింది హిడ్మానే. అందుకే ఆయన మరణంతో సాయుధ పోరాటం రూపురేఖలు, దశాదిశ మారిపోయే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు పట్టుబడిన వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ సమీపంలోని కానూరులో 28 మంది, ప్రసాదంపాడులో నలుగురితో కలిపి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 50 మంది మావోలు ఎలాంటి ప్రతిఘటన, ఎదురు కాల్పులు లేకుండా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. పట్టుబడిన తీరు చూస్తే లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు వారిని అరెస్టు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పట్టుబడిన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చారని పోలీసులు చెబుతున్నా.. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది చెప్పడంలేదు. మావోయిస్టులు వచ్చిన సమాచారం ముందే తెలుసని, అప్పటినుంచి వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు వారు ఎలా వచ్చారనే విషయం కూడా పోలీసులకు తెలియకుండా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవ్‌జీ దొరకలేదట! మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన 9 మంది మావోయిస్టులు పట్టుబడినట్టు ప్రకటించిన పోలీసులు.. దేవ్‌జీ ఏమయ్యారు, ఎక్కడున్నారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. దేవ్‌జీ తమ అదుపులో మాత్రం లేరని చెబుతున్నారు. అయితే, దేవ్‌జీ పోలీసుల అదుపులోనే ఉన్నారని హక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చినట్టు.. ఎలా పట్టుబడినట్టు? మావోయిస్టు అగ్రనేత హిడ్మా భద్రతను పర్యవేక్షించే కీలక సభ్యురాలితో పాటు అదే విభాగానికి చెందిన 28 మంది సభ్యులు విజయవాడలో పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు హతం కాగానే.. రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి 50 మంది మావోయిస్టులను పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు వీరంతా ఎన్‌కౌంటర్‌కు ముందుగానే పోలీసులకు పట్టుబడ్డారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. వీరంతా బృందాలుగా విడిపోయి వేర్వేరు ప్రాంతాలకు ఎందుకు వచ్చారు? ఇంచుమించు అంతా ఒకే సమయంలో ఎలా పట్టుబడి ఉంటారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
లొంగిపోయే వాళ్లని కూడా ఎన్ కౌంటర్ చేస్తున్నారు
-
మావోయిస్టుల ఎన్కౌంటర్.. హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎన్కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి? అని ప్రశ్నించారు.ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు నేతలు చనిపోతున్నారు. తాజాగా ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మావోయిస్టులు శాంతి చర్యలకు సిద్ధమని ప్రకటించారు కదా. అయినా కేంద్రం డెడ్‌లైన్ పెట్టి మరీ ఎలిమినేట్ చేస్తామంటోంది. ఎన్కౌంటర్ల బదులుగా ఏకపక్ష కాల్పులు జరుగుతున్నాయి. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదు. అడవులను కార్పొరేట్ శక్తుల వశం చేసే ప్రయత్నం జరుగుతోంది. సంపదను కార్పొరేట్లకు పంచడమే ఈ అభివృద్ధి నమూనా.ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతుంది. అదే జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లా తయారవుతాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి?. ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఆదివాసీల కోసం వచ్చిన చట్టాలనీ ఏమైపోయాయి. ఆయుధాలు పట్టుకోవద్దని చట్టంలో నిబంధన ఉంది. ప్రభుత్వం కూడా చట్టానికి లోబడే ఆయుధం వాడాలి కదా? అని ప్రశ్నించారు. -
కథ ముగిసింది.. శ్రీలంక పారిపోతూ పోలీసులకు బుక్కయ్యాడు
-
హిడ్మా.. ఎన్‌కౌంటర్‌కు ముందు ఏం జరిగింది?
సాక్షి, అమరావతి: ఆపరేషన్ కగార్ కారణంగా ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతి చెందారు. దీంతో, మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, తాజాగా హిడ్మా.. ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది. అందులో కీలక విషయాలను వెల్లడించారు.మావోయిస్టు కీలక నేత హిడ్మా.. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది’ అని లేఖలో రాసుకొచ్చాడు.ఇదిలా ఉండగా, హిడ్మా లేఖపై తాజాగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పందిస్తూ.. హిడ్మా లేఖ రాసిన విషయం మాకు తెలియదు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడు. అతడిని పట్టుకుని చంపామనేది అసత్యం. లొంగిపోయేందుకు వచ్చిన ఎవరినీ ఎన్కౌంటర్ చేయలేదు. ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు. మావోయిస్టులు లొంగిపోవాలి’ అని సూచించారు. -
Magazine Story: ఎన్ కౌంటర్ లో మాస్టర్ మైండ్ హతం
-
భద్రతాబలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మడివి హిడ్మా. ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోలు సైతం మృతి
-
పక్కా ప్లాన్‌తోనే..!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా, మరో మావోయిస్టు నేత దేవ్‌జీ లక్ష్యంగా గత నెల రోజులుగా భద్రతా దళాలు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల దగ్గర మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ సమయంలో పెరిగిన నిర్బంధం కారణంగా అజ్ఞాత జీవితం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన హిడ్మా టీమ్‌లోని కొందరు కీలక నేతలు లొంగుబాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమకు ఉన్న కాంటాక్ట్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.కొందరు కీలక సభ్యులు గ్రేహౌండ్స్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే హిడ్మాను కూడా లొంగిపొమ్మంటూ పోలీసులు, ప్రభుత్వ వర్గాలు రాయబారం పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో హిడ్మా దండకారణ్యం విడిచిపెట్టినట్టు సందేహం కలిగిన వెంటనే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ పువర్తికి వెళ్లి హిడ్మా తల్లిని కలిశారు. లొంగిపోవాలంటూ ఆమె ద్వారా హిడ్మాకు సందేశం పంపారు. ‘ఎక్కడున్నావ్ బిడ్డా సజీవంగా ఇంటికి రా.. ఇక్కడే కష్టపడి బతుకుదాం.. కలో గంజో తాగుతూ జీవిద్దాం.. నువ్వు ఎక్కడున్నావో ఇంటికి వచ్చేయ్.. ఎక్కడున్నావో చెప్పు నేనైనా వస్తా... రెండూ లేదంటే నేనే నిన్ను వెదుక్కుంటూ అడవి బాట పడతా..’అంటూ ఆమె ద్వారా పంపిన సందేశం హిడ్మాకు చేరిందో, లేదో కానీ వారంలోగానే ఆయన ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.దేశం దాటేందుకు ప్రయత్నం!లొంగుబాటు ప్రతిపాదనపై హిడ్మా ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనలను ఏకపక్షంగా తిరస్కరించకుండా.. అలాగని వెంటనే ఒప్పుకోకుండా జనవరి వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసు వర్గాలతో వైరాన్ని తగ్గించుకునే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే సముద్ర మార్గం గుండా దేశం దాటి సేఫ్ జోన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు హిడ్మా అనుచరవర్గం కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత పోలీస్ వర్గాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు వెళ్లిన దళాలు సురక్షితంగా వెళ్లేలా చేసి..రెండు వారాల కిందట కర్రెగుట్టల పరిసరాలను విడిచిన హిడ్మా బృందం చిన్న జట్లుగా విడిపోయి తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండడం, ఆదివాసీ గ్రామాల్లో ఉండే జనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో స్థానికులను కలవడం కష్టంగా మారింది. దీంతో ఒడిశా మీదుగా ఏపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు మావోల కదలికలపై నిఘా వేసిన బలగాలు అనువైన సమయం కోసం ఓపిగ్గా వేచి చూశాయి. ప్లాన్ ప్రకారం ముందుగా వెళ్లిన బ్యాచ్‌లకు సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాయి. దీంతో నమ్మకం కుదిరిన హిడ్మా తన బృందంతో ఏపీలోకి వచ్చారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టగా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఆజాద్ ఎక్కడ?అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజన్ కార్యదర్శిగా ఉన్న కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం గడిచిన నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆజాద్ పర్యవేక్షణలో ఉన్న అల్లూరి జిల్లాలోకి హిడ్మా తన బృందంతో చేరుకోవడమనేది కాకతాళీయంగా జరిగిందా లేక పోలీసులు పన్నిన వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది. -
హిడ్మా ఎన్కౌంటర్.. ‘మోస్ట్ వాంటెడ్’ మృతి
రంపచోడవరం,సాక్షి, అమరావతి: వరుసగా పలువురు అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో విలవిలలాడుతున్న మావోయిస్టులకు కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది! రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క, మరో నలుగురు మావోయిస్టులు దేవ్, లక్మల్ అలియాస్ చైతు, మల్ల అలియాస్ మల్లలు, కమ్లూ అలియాస్ కమలేశ్ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం నెల్లూరు–ఇజ్జలూరు మధ్య అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 6 నుంచి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఏవోబీ సరిహద్దుల్లో వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఘటన వివరాలను ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్హా, ఎస్పీ అమిత్‌బర్దర్ రంపచోడవరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు వెల్లడించారు. సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ పంకజ్‌కుమార్ మీనా, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాశ్ పాల్గొన్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పిస్తోలు, రివాల్వర్, సింగిల్ బ్యారెల్ గన్‌తోపాటు 28 రౌండ్ల ఏకే 47 రైఫిల్స్ బుల్లెట్లు, 5 రౌండ్ల పిస్తోలు బుల్లెట్లు, ఖాళీ ఏకే 47, పిస్తోలు షెల్స్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు లడ్హా తెలిపారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, ఏడు కిట్ బ్యాగులను కూడా స్వాదీనం చేసుకున్నామన్నారు. మరి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు భావిస్తున్నామని, వారి కోసం భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటన వివరాలివీ.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తున్న అడిషనల్ డీజీపీ నిఘా పక్కా సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా జరుగుతున్న పోలీస్ కూంబింగ్‌తో కొందరు మావోయిస్టులు ఆంధ్రాలోని మైదాన ప్రాంతం షెల్టర్ జోన్‌కు చేరుకోగా మరికొందరు అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. గత రెండుమూడు రోజులుగా మావోయిస్టుల కదలికలపై నిఘా విభాగం నుంచి కచ్చితమైన సమాచారం రావడంతో అల్లూరి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం వద్ద ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టి సుమారు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 30 మంది కోసం గాలిస్తున్నారు. కాగా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. విజయవాడ కానూరులోని న్యూ ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్న భవనంలోకి ప్రవేశిస్తున్న బలగాలు ఆదివాసీ నేత.. గెరిల్లా యుద్ధతంత్రం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మడివి హిడ్మా 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అతి తక్కువ సమయంలోనే అగ్రనేతగా ఎదిగాడు. ఆదివాసీ వర్గానికి చెందిన హిడ్మాకు పలు భాషల్లో మంచి పట్టుంది. మావోయిస్టు అగ్రనేత రామన్న సారథ్యంలో గెరిల్లా యుద్ధతంత్రంలో హిడ్మా ఆరితేరారు. 2019లో రామన్న మృతి అనంతరం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి గెరిల్లా పోరుతో మెరుపు దాడులకు దిగి మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు. పలు దాడులను స్వయంగా పర్యవేక్షించాడు. హిడ్మా నేతృత్వంలో 2010 ఏప్రిల్‌లో చింతల్నార్ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. 2013లో దర్భా ఘాట్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. 2017 బుర్కాపాల్ వద్ద మరోసారి మావోయిస్టుల దాడిలో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘటనల వెనకహిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. హిడ్మాను లొంగుబాట పట్టించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు పూవర్తిలో ఉంటున్న ఆయన తల్లి ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. కర్రె గుట్టల్లో తృటిలో తప్పించుకుని.. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం హిడ్మా టార్గెట్‌గా కర్రె గుట్టలను చుట్టుముట్టిన పోలీసులు నాలుగు రోజులపాటు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా తాజాగా ఎన్కౌంటర్లో మృతి చెందడం గమనార్హం. -
‘హిడ్మాను విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లిలో చంపారు’
విజయవాడ: మావోయిస్టు మాస్టర్ మైండ్ మడావి హిడ్మా ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. హిడ్మాను విజయవాడలో పట్టుకొని మారేడుపల్లి చంపారని, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శించారు. హిడ్మా సెక్యూరిటీ కానూరులో ఉంటే హిడ్మా మారేడుమిల్లిలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. హిడ్మాది కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ అని అన్నారు.ఇంకా దేవ్‌జీ అనుచరులు ఏపీలో 9 మంది ఉన్నారని చెబుతున్నారని, దేవ్‌జీని ముందే పట్టుకున్నారని అనుకుంటున్నామన్నారు. దేవ్ జీ ఒరిస్సా అడవిలో ఉన్నారని కథనాలు చెబుతున్నారని, దేవ్ జీని సైతం విచారణ పేరుతో చంపే అవకాశం ఉందన్నారు చిలక చంద్రశేఖర్. అరెస్టు చేసిన 31 మంది ఎవరి అనుచరులు అయినా వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. 71 మందిని ఇప్పటివరకూ అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారని, వాళ్లను కోర్టులో ప్రవేశఫెట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లతో నేతలను పట్టుకొని చుట్టుముట్టి చంపారని, ఇవన్నీ కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న హత్యలేనన్నారు. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. -
చలపతితో మొదలు నంబాల, హిడ్మాతో ముగింపు!
మావోయిస్టు పార్టీని, ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఆపరేషన్ కగార్(Operation Kagaar) చేపట్టింది అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ. ఇందుకోసం 2026 మార్చిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే.. ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు.. ఇతరత్రా పరిణామాలు ఆ లక్ష్యానికి భద్రతా బలగాలను చేరువే చేశాయి. కేంద్ర హోం శాఖ గణాంకాలు పరిశీలిస్తే.. గత పదేళ్లలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్-ఒడిశా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. ఆ పార్టీకి వరుస గట్టి దెబ్బలు తగలడం మొదలైంది. మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (రామచంద్ర రెడ్డి అలియాస్ ప్రతాప్)తోసహా 13 మంది మావోయిస్టులు 2025 జనవరి 21న ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఒడిషాలో మావోయిస్టు ఉద్యమం శకం ముగిసింది. అయితే.. ఈ ఎన్‌కౌంటరే కగార్‌కు ప్రారంభ సంకేతంగా మారింది. ఇక్కడి నుంచే.. కేంద్రం చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చాయి.ఆపరేషన్ కగార్ (Operation Kagaar)లో భాగంగా.. 1 లక్షకు పైగా భద్రతా సిబ్బంది, డ్రోన్లు, AI ఆధారిత నిఘా పరికరాలను దట్టమైన అడవుల్లో వినియోగించాయి భద్రతా బలగాలు. ఈ వ్యూహాత్మక చర్యలు వల్ల మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లు.. ఇంకోవైపు మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈలోపు..అబూజ్మడ్ అడవుల్లో మే 21వ తేదీన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నంబాలతో పాటు ఆ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అయ్యింది. ఇక్కడి నుంచి మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టసాగాయి. ఆ వెంటనే మల్లోజుల వెంకటరావు (సోను), ఆశన్న వంటి కీలక నేతలు సరెండర్ కావడం.. ఇంటెలిజెన్స్ ఆధారంగా కూంబింగ్ ఆపరేషన్లు పెరగడం వల్ల ఉద్యమం లోపల భయాందోళనలు పెరిగాయి. సెంట్రల్‌పై కమిటీ లొంగిపోయిన సభ్యుల ఆరోపణలు.. వాళ్లను ఉద్యమ ద్రోహులుగా సెంట్రల్ కమిటీ ప్రకటించడం.. ఇలా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ విశేషం ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగింది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావించింది కూడా. ఇప్పుడు అది కూడా జరగడంతో ఆపరేషన్ కగార్ దాదాపుగా ముగిసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. -
హిడ్మా స్కెచ్ వేస్తే.. మావోయిస్టుల మాస్టర్ మైండ్ మృతి
సాక్షి, హైదరాబాద్/ అల్లూరి జిల్లా: మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో లక్మల్, కమ్లూ, మల్లా, దేవ్(హిడ్మా గార్డ్) ఉన్నారు. హిడ్మా మృతిని అటు ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖతో పాటు ఇటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా ధృవీకరించారు.గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. తాజాగా.. రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి కలిశారు. ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు. ‘‘ఇప్పటికైనా ఇంటికి రా బిడ్డా’’ అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా. ఈలోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉంది. ఆయన సతీమణి హేమపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ఏరియాభారీగా ఆయుధాలు స్వాధీనంహిడ్మా మృతిపై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా మీడియాతో స్పందించారు. ఎన్కౌంటర్ అయిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారాయన. ‘‘రెండు రోజుల కిందటే మాకు పక్కా సమాచారం వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో తలదాచుకునే అవకాశం లేకపోవడంతో ఏపీకి వచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచాం’’ అని అన్నారాయన.హిడ్మా నేపథ్యం.. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. కిషన్‌జీ సారథ్యంలో హిడ్మా తొలి అడుగు పడింది. 25 ఏళ్ల కిందట ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించారు. ఆయన దళానికి అత్యంత శక్తివంతమైన టీంగా పేరుంది. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై ఆయనకు పట్టుంది. చిన్నవయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నియ్యాడు. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగించాయి. హిడ్మా స్కెచ్ వేస్తే..మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నారు..2007లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు -
క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్?!
సాక్షి, చత్తీస్‌గఢ్: మావోయిస్టుల లొంగుబాటు యాత్ర చివరి అంకానికి చేరిందా?. ఆపరేషన్ కగార్‌లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా?. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్‌వాంటెడ్, మావోయిస్టు పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా(madavi Hidma) లొంగిపోబోతున్నారా??. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ ప్రచారంపై స్పందించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా లొంగిపోతున్నారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమారు 200 మంది అనుచరులతో కలిసి హిడ్మా లొంగుబాటు కానున్నారనేది ఆ ప్రచార సారాంశం. ఈ ప్రచారంపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్పందించారు. హిడ్మా లొంగుబాటు విషయంపై జరిగేదంతా ఉత్త ప్రచారమేనని కొట్టిపారేశారు. అయితే.. హిడ్మా లొంగిపోతే మంచి పరిణామమేనని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం కింద ఆయనకు రావాల్సిన రివార్డ్ నగదును ఆయనకే అందజేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆశన్న తమ దళాలతో లొంగిపోయారు. దీంతో వాళ్లను ఉద్యమ ద్రోహులుగా మావోయిస్టు పార్టీ అభివర్ణిస్తూ ఓ లేఖ రాసింది. నిజంగానే.. హిడ్మా గనుక లొంగిపోతే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు.ఎవరీ హిడ్మా.. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్టు సమాచారం. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.సంబంధిత కథనం: చదివింది ఐదో తరగతి! పాతికేళ్లకే తుపాకీ పట్టి.. -
మడావి హిడ్మా ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మడావి హిడ్మా. ఇటీవల హిడ్మా పేరుతో ఓ ఏరియా కమిటీ సభ్యుడు లొంగిపోతే ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పీఎల్జీఏ కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్న హిడ్మాకు సంబంధించిన కీలక సమాచారం భద్రతా దళాలకు చిక్కినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం ఎక్కడ పాగా వేశాడో తెలియరాకున్నా దాదాపు 20 ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫొటోగా పేర్కొంటున్న చిత్రం శుక్రవారం వెలుగుచూడడం గమనార్హం.అత్యంత రహస్యంమడావి హిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీమ్‌లో 10–12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బీ టీమ్‌లో 20–22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళం/కంపెనీలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటాడు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలిసింది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1కి కమాండర్‌గా ఉన్నాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజినల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది.జిరామ్ఘాటీతోసల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్‌గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్‌ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతోపాటు హిడ్మా కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెలరోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపుదాడికి దిగారు. హెలికాప్టర్ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజులు నెలకొన్న ఉత్కంఠ హిడ్మా అంటే హడల్ అనే విధంగా మారింది. దీంతో భద్రతాదళాలు హిడ్మాపై కూపీ లాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.కిషన్‌జీ, చలపతి అడుగుజాడల్లో హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాల ను నరనరాన ఒంట బట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ ఏ ఫర్ ఆరమ్స్, బీ ఫర్ బెంగాల్, సీ ఫర్ చారు మంజుదార్ అన్నట్టుగా కిషన్ జీ ఆలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నార్ –టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ అంబూష్‌దాడిలో 76 మంది సీర్‌ఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. -
వరుస ఎదురుదెబ్బలు.. మావోయిస్టుల కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: దండకారణ్యంలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు మావోయిస్టు పార్టీపై పెను ప్రభావం చూపుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి మద్వీ హిడ్మాను ఆ పార్టీ అగ్రనాయకత్వం తొలగించింది. దండకారణ్యంలో కేంద్ర బలగాలను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందారనే కారణంతోనే హిడ్మాను తొలగించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 16 మంది మావోయిస్టులు ఇటీవల హతమైన నేపథ్యంలో హిడ్మాను తొలగించడం గమనార్హం.వాస్తవానికి చలపతి నాయకత్వంలోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రధానంగా మిలటరీ ఆపరేషన్ల ప్రణాళిక, నిర్వహణ చలపతి నుంచే ఆయన నేర్చుకున్నారు. వారిద్దరిదీ గురుశిష్యుల బంధంగా చెబుతారు. 2017లో చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో భద్రతా బలగాలపై దాడికి హిడ్మానే నేతృత్వం వహించారు. దాంతో ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర కమిటీ సభ్యునిగా నియమించారు. 2022 తరువాత ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి మావోయిస్టు అగ్రనేతలు చత్తీస్ఘడ్ సరిహద్దులకు తరలిపోయారు. అప్పటి నుంచే చలపతి, హిడ్మా మధ్య విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. చలపతి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉండటంతో ఒడిశాలోని మావోయిస్టు పార్టీ వ్యూహాలను హిడ్మానే పర్యవేక్షిస్తున్నారు.మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి అరెస్ట్ ఎటపాక: చత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని అల్లూరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం ఎటపాకలో మీడియాకు వెల్లడించారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా కొన్ని రోజులుగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి పోలీసులు ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ చెరువుగుంపు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జి అలియాస్ లలిత్‌ను పోలీసులు పట్టుకున్నారు. పొజ్జి ఛత్తీస్‌గఢ్‌లోని గొండిగూడకు చెందిన వ్యక్తి అని ఎస్పీ చెప్పారు. చదవండి: ఓవర్ యాక్షన్ ఫలితం.. చిక్కుల్లో ఖాకీలు -
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. చరిత్ర అంతా చిక్కడు దొరకడు..!
తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్-ఛత్తీస్‌ఘడ్ సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్‌లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ- బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో... పలువురు మావోలతో పాటు హిడ్మా హతమయ్యాడన్నది పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్కౌంటర్ కోసం పోలీసులు హెలికాప్టర్ వాడినట్టు స్థానికులు కొందరు చెబుతున్నారు. 50లక్షల రివార్డు ఉన్న హిడ్మాను నాలుగు రాష్ట్రాల పోలీసులు గత రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు. చేతిలో నెంబర్ వన్ బెటాలియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది. టార్గెట్ 100% 2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. చదవండి: (తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?) హింస vs సిద్ధాంతం చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో ఒక్క గోండు కూడా లేడు. ఛత్తీస్‌ఘడ్‌లో ప్రస్తుతం 80శాతం మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. అయితే వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వీరిలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదని కొందరు విమర్శించారు. కేవలం చంపడంపైనే శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భంలోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల... ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోడానికి ఒక అవకాశంగా మారింది. నమ్మకం వమ్మయిందా? హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్‌కు కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా... ఎన్కౌంటర్లో ఎలా చనిపోతారనే చర్చ జరుగుతోంది. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే హిడ్మా బ్రతికే ఉన్నాడని తర్వాత తేలింది. ప్రస్తుత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఇప్పటివరకు తెలంగాణ -ఛత్తీస్గడ్ పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అటు మావోయిస్టు పార్టీ కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. - ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి
-
తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. కాగా, 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. చదివింది మాత్రం 7వ తరగతే అయినా మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు హిడ్మా. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్ కావడంతో.. హిట్ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ పని చేసిన హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఉంది. -
మావోయిస్టు కీలక నేత హిడ్మాకు తీవ్ర అస్వస్థత!
ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టు కీలక నేత మడవి హిడ్మా తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. హిడ్మా కోవిడ్‌తో బాధపడుతున్నాడని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అతడు లొంగిపోతే చికిత్స అందిస్తామని అంటున్నారు. కాగా, మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్ సం తోష్ అలియాస్ ఇడ్మాల్ అలియాస్ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం. ఇతడిపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. చదవండి : కీచకుడు: వాట్సాప్ కాల్స్‌తో 370 మంది మహిళలకు టార్చర్ -
సుక్మా దాడి ప్రతీకారంగానే..!
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రతీకార చర్య అని మావోయిస్టు పార్టీ తెలిపింది. అశేష ప్రజల అణచివేతకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు దండకారణ్య మావోయిస్టు స్పెషల్ జనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఈ దాడి చేశామని, పోలీసులపై వ్యక్తిగత కక్ష్యతో కాదని పేర్కొన్నారు. సుక్మా దాడితో తమపై హింసావాదులనే ముద్రవేస్తసున్నారని, కానీ అణగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. మావోయిస్టుల సమాచారం తెలుపాలంటూ భద్రతా బలగాలు గిరిజనులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని రహస్యంగా మట్టుబెడుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశసంపదను దోచుకుంటున్నదని విమర్శించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
సుక్మా దాడి వెనుక సూత్రధారి ఇతనే!
-
సుక్మా దాడి వెనుక సూత్రధారి ఇతనే!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి వెనుక సూత్రధారి ఎవరు అనే దానిపై పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. 24 ఏళ్ల కరుడుగట్టిన మావోయిస్టు కమాండర్ ఈ ఊచకోతకు సూత్రధారి అని తెలుస్తోంది. 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఈ మారణకాండకు సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్ మిలిటరీ బెటాలియన్ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు తెలుస్తున్నదని పోలీసులు బుధవారం తెలిపారు. దక్షిణ సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కిరాతకమైన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 2010లో సుక్మా పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించారు. గత మార్చి 11న 12మంది భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న దాడి వెనుక కూడా హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ కారణమని భావిస్తున్నారు. మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన బస్తర్‌లో హిద్మా కరుడుగట్టిన మావోయిస్టుగా పేరొందాడు. దక్షిణ సుక్మాలోని పుర్వతి గ్రామంలో జన్మించిన అతని నాయకత్వ పరిధిలో ప్రస్తుతం దక్షిణ సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. చూడటానికి బక్కపలుచగా కనిపించే హిద్మా అత్యంత కర్కశమైన రెబల్ నాయకుడిగా పేరొందాడని, అతనికి తన ప్రాంతంనిండా చాలా నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.


