విజయవాడ: మావోయిస్టు మాస్టర్ మైండ్ మడావి హిడ్మా ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. హిడ్మాను విజయవాడలో పట్టుకొని మారేడుపల్లి చంపారని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని విమర్శించారు. హిడ్మా సెక్యూరిటీ కానూరులో ఉంటే హిడ్మా మారేడుమిల్లిలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. హిడ్మాది కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్ అని అన్నారు.
ఇంకా దేవ్‌జీ అనుచరులు ఏపీలో 9 మంది ఉన్నారని చెబుతున్నారని, దేవ్‌జీని ముందే పట్టుకున్నారని అనుకుంటున్నామన్నారు. దేవ్ జీ ఒరిస్సా అడవిలో ఉన్నారని కథనాలు చెబుతున్నారని, దేవ్ జీని సైతం విచారణ పేరుతో చంపే అవకాశం ఉందన్నారు చిలక చంద్రశేఖర్. అరెస్టు చేసిన 31 మంది ఎవరి అనుచరులు అయినా వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు.
71 మందిని ఇప్పటివరకూ అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారని, వాళ్లను కోర్టులో ప్రవేశఫెట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లతో నేతలను పట్టుకొని చుట్టుముట్టి చంపారని, ఇవన్నీ కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న హత్యలేనన్నారు. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.


