ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లు | Delhi air pollution protest takes a turn Hidma posters display | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లు

Nov 24 2025 9:21 AM | Updated on Nov 24 2025 10:37 AM

Delhi air pollution protest takes a turn Hidma posters display

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు దిగారు. ఈ నిరసనల్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫొటోలు, ఆయన అనుకూల నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణంగా పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదివారం పలువురు.. ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుకూల వ్యాఖ్యలతో ప్లకార్డులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. నిరసనకారులు.. బిర్సా ముండా నుండి మాద్వి హిద్మా వరకు మన అడవులు, పర్యావరణపై పోరాటం కొనసాగింది. మన బిడ్డలను మనమే చంపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం పోరాటం కొనసాగుతుంది. రెడ్‌ సెల్యూట్‌ టూ హిడ్మా.. అమర్‌ రహే అంటూ పోస్టర్‌ను ప్రదర్శించి నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకోగా నిరసనకారులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు పెప్పర్‌స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులు.. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement