breaking news
delhi protest
-
నిరసనల పేరిట అరాచకానికి యత్నం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గత వారం రోజులుగా ఢిల్లీలో నిరసనల పేరిట డ్రామాలాడుతూ దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పారీ్టలు దుర్వినియోగం చేస్తున్నాయని, దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోల్పోయి ఓడిపోతున్న కాంగ్రెస్ పారీ్ట...తమ ఓటమికి ఎన్నికల కమిష¯న్ను, సుప్రీంకోర్టును బాధ్యులను చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాద్ధాంతం చేశారని, ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా గద్దె దిగాలని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. వేలాది మందితో సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లి సీజేఐపై ఒత్తిడి తీసుకురావడం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదన్నారు.రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారు.. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై రాహుల్‌గాంధీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సర్ æసర్వేలో దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మరణించినట్లు తేలింది. చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోతే బోగస్ ఓటింగ్ జరగదా? మరో 6.3 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కోటి మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అసలు ఆచూకీ లేని వ్యక్తుల ఓట్లు 3 కోట్ల వరకూ ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే రెండుచోట్ల పేర్లున్న 9 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించారు.‘ఒక వ్యక్తికి ఒకే ఓటు‘విధానం రాజ్యాంగబద్ధం కాదా? ప్రతి పోలింగ్ బూత్‌కు కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఉన్నారు. తప్పులుంటే క్షేత్రస్థాయిలో ఆధారాలతో ఎందుకు సరిదిద్దడం లేదు. కేరళం, తమిళనాడులలో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ఎంతో మేలు చేసిందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాలే స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బ్యాలెట్ పేపర్లతో జరిగిన గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, త్రిపుర రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు.పెట్టుబడులకు గండి ‘విపక్షాల బాధ్యతారాహిత్యం వల్ల ఒక్క రోజే రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలతో ఢిల్లీ మార్కెట్లు స్తంభించిపోయాయి. చిరు వ్యా పారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌గాంధీ బారికేడ్లు ఎక్కి డ్యాన్సులు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నారు. ఓ గర్భిణీ జర్నలిస్టును, మహిళా పోలీసు అధికారులను దురుసుగా నెట్టివేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు.. రాహుల్‌గాంధీ గజం ఎత్తు ఎగిరితే.. సీఎం రేవంత్‌రెడ్డి తాను రెండు గజాల ఎత్తు ఎగురుతానంటూ ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ధర్నాలకు పిలుపునిస్తే కనీస అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయించే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ మాట్లాడటం హాస్యాస్పదం. వర్షాల్లేక రైతులు, కరెంట్ కోతలతో పరిశ్రమలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వాటిని పట్టించుకోకుండా వారానికోసారి ఢిల్లీకొచ్చి రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తి వెళ్తున్నారు..’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి -
జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలు, కార్యకర్తలు మంగళవారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పోలీసుల అడ్డంకులను దాటుకుని నిరసన తెలిపేందుకు ప్రయతి్నంచారు. ఇనుప గేటు, పోలీసుల బారికేడ్లను దూకి జంతర్‌మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘సర్ఫరోష్ కీ తమన్నా’అనే విప్లవ కవితను కూడా పఠించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ నాయకులను ద్వారకా జిల్లాలోని జాఫర్పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఓ అధికారి తెలిపారు.కొంతమంది సీజేపీ కార్యకర్తలు అక్కడ గుమిగూడటంతో పోలీస్ స్టేషన్ లోపల, చుట్టుపక్కల భద్రతను పెంచినట్లు చెప్పారు. జంతర్‌మంతర్ తాము తిరిగి స్వా«దీనం చేసుకున్నట్లు సీజేపీ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. నిరసన తెలిపే హక్కు తమకు ఉందని వెల్లడించింది. తమ సభ్యులు బారికేడ్లను ఛేదించుకొని, జంతర్‌మంతర్ ప్రదేశంలోకి ప్రవేశించి, అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని వెల్లడించింది.జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి అధికారం ఎక్కడిది?జంతర్‌మంతర్ వద్ద తాము ప్రతిపాదించిన శాంతియుత నిరసన కోసం తేదీ, సమయం కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు లేఖ సమర్పించిన రోజే.. అంటే అక్టోబర్ 12న ప్రభుత్వం నుంచి డీనోటిఫికేషన్ ప్రకటన వెలువడిందని అశుతోష్ రాంకా వెల్లడించారు. నిరసన తెలిపేందుకు అనుమతి కోసం అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం చెప్పినట్లు గుర్తుచేశారు. అనుమతి కోరుతున్న సమయంలోనే నిబంధనలను మార్చడం ఏమిటని ప్రశ్నించారు.నిరసన ప్రదేశంలోకి ప్రవేశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన ఆంక్షలను సౌరవ్ దాస్ తప్పుపట్టారు. ప్రజల సొత్తు అయిన జంతర్‌మంతర్‌ను లాక్కోవడానికి హోంశాఖకు అధికారం ఎక్కడదని నిలదీశారు. నిరసనలకు కేటాయించిన జంతర్‌మంతర్‌లో నిరసనలు కచ్చితంగా జరుగుతాయన్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేదాకా అక్కడి నుంచే తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ.. రాజ్యాంగం మనతోనే ఉందని సౌరవ్ దాస్ అన్నారు.జంతర్‌మంతర్ వద్ద అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. నిర్బంధంలో ఉన్న సీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘దిశ’అనే విద్యార్థి సంఘం సభ్యులు మంగళవారం కన్నాట్ ప్లేస్ నుంచి జంతర్‌మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జంతర్ మంతర్‌ను తిరిగి స్వా«దీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని తప్పుపట్టారు.ప్రతిఘటనను రద్దు చేయలేరు: దీప్కేతమపార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మండిపడ్డారు. ‘ప్రజల ప్రతిఘటనను మీరు రద్దు చేయలేరు’అని తేల్చిచెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ మంగళవారం సోషల్ మీడియాలో దీప్కే పోస్టుచేశారు. జంతర్‌మంతర్‌లో జాతీయ జెండా ఎగరవేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.నిరసన ప్రదేశం వైపు సీజేపీ సభ్యులు దూసుకెళ్లడం, ఒక గేటుపైకి ఎక్కి, త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేయడం, ఆ తర్వాత పోలీసు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్న ఒక వీడియోను దీప్కే షేర్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిర్ణీత నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తే, జవాబుదారీతనం కోరుతున్న ప్రజల గొంతు నొక్కేయవచ్చని ప్రభుత్వం భావిస్తే ఈ ఉద్యమం లక్ష్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టే. జంతర్ మంతర్ కేవలం పటంలో ఒక ప్రదేశం మాత్రమే కాదు.అది అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడానికి పౌరులు గుమిగూడిన చోటు. ఏ పరిపాలనాపరమైన ఉత్తర్వు కూడా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చెరిపివేయలేదు’’అని దీప్కే ఉద్ఘాటించారు. సీజేపీ నాయకులు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని, వారిని కలిసేందుకు తమ న్యాయవాదులకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ నాయకులను కిడ్నాప్ చేశారని పోలీసులపై ధ్వజమెత్తారు. పోలీసులు చట్టాన్ని పాటించడం లేదని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చివరకు జంతర్ మంతర్ వద్దే జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీకు చేతనైంది చేసుకోండి’అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు.ఇదీ చదవండి: కలిసికట్టుగా పోరాడుతాం! -
ఫారం-6లో మార్పులు.. EC ప్రకటనపై CJI ఆగ్రహం
-
ఢిల్లీలో హై టెన్షన్... SIR రద్దు..! సుప్రీంకోర్టుకు భారీ ర్యాలీ
-
రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి సీఈసీకి రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
-
జైలుకైనా సిద్ధం.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం: అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: ఓట్ల తొలగింపు ఆరోపణలపై పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్త అభిజీత్ దీప్కే ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరగనున్న ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి బయలుదేరిన సందర్భంగా ఆయన ఏఎన్ఐతో మాట్లాడారు. జైలుకు పంపుతామనే బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని దీప్కే పేర్కొన్నారు. తమపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) వంటి చట్టాలను ప్రయోగించినా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలిపారు.దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని దీప్కే ఆరోపించారు. ఈ కారణంగా ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో విధించిన ఆంక్షలపైనా దీప్కే ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తికి రక్షణ కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధానిని మొత్తం స్తంభింపజేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైలు సేవలను నిలిపివేశారని, మెట్రోను మూసివేశారని, రహదారులను దిగ్బంధించారని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని విమర్శించారు.మరోవైపు, నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 35 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ఏఎన్ఐ తెలిపింది. శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై జవాబుదారీతనం కోరడమే నిరసన ఉద్దేశమని సీజేపీ తెలిపింది. నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన -
Delhi protest: ముందస్తుగా 40 మంది.. పోలీసుల అదుపులో..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమానికి ముందు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దేశ రాజధానిలోని మొత్తం 15 జిల్లాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 నుంచి 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతరులను సమీకరించే లేదా వారిపై ప్రభావం చూపగలరని అనుమానిస్తున్న వ్యక్తుల కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు.అనుమానిత వ్యక్తుల నివాసాల వెలుపల నిఘాను పెంచినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసనకు ముందు భద్రతాపరమైన చర్యలను విస్తృతం చేసినట్లు పేర్కొన్నాయి. రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించాయి. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిరసన సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజేపీ ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన -
CJP ఆందోళనతో ఢిల్లీలో హైఅలర్ట్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత!
-
CJP నిరసనల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
సెంట్రల్ ఢిల్లీలో లాక్డౌన్..!
ఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) రేపు(శనివారం, అక్టోబర్ 10వ తేదీ) జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో లాక్డౌన్ పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.. ఢిల్లీ నలుమూలలా పోలీసులను భారీగా మోహరించింది, అదే సమయంలో ఢిల్లీలో దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని ఇప్పటికే పోలీసులు సూచనలు చేస్తున్నారు. మరొకవైపు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేయనున్నారు. ఢిల్లీలో ఈ రోజు అర్థరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ కానున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్లు గేట్లు మూసివేయనున్నారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రైల్వే సర్వీసులు బంద్ చేయనున్నారు. అవసరమైన మేర మాత్రమే నియంత్రణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రధానమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలో తీసుకుంటున్నారు. హోటల్స్, పీజీ హాస్టల్స్ లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో సెక్షన్ 163 BNS యాక్ట్ అమలు చేయనున్నారు. ఢిల్లీలో ఎలాంటి నిరసనలకు ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసుల మైకులలో ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపటి సీజేపీ ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా 23 వేల మంది కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సున్నితమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే శాంతియుత నిరసనలకు జంతర్‌మంతర్ కాకుండా మరోచోట అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా సుప్రీం ఆదేశించింది. సామన్య ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఒకవైపు ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని పోలీసుల ప్రకటన.. మరొకవైపు సీజేపీ ధర్నాకు పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనబడుతోంది. Over dozens of students onboard Goa Express and on their way to participate in protests in Delhi were detained by the local police in Itarsi, Madhya Pradesh. https://t.co/cdw8ooVUGr— Piyush Rai (@Benarasiyaa) October 9, 2026 ఇదీ చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టనున్న నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టనున్న నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితిని బట్టి నిబంధనలు ఉండాలి. కానీ ప్రజల రాకపోకలపై పూర్తి నిషేధం విధించలేమని అత్యున్నత న్యాయ స్థానం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మెట్రో, ఇతర రైలు సర్వీసులను పూర్తిగా నిలిపివేయడం సరికాదని తేల్చిచెప్పింది.ఓటరు జాబితాల సవరణ (సర్) ప్రక్రియలో లోపించిన పారదర్శకత, అందుకు బాధ్యులైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ శనివారం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, కాబట్టి రవాణా వ్యవస్థను మొత్తంగా మూసివేయడం తగదని కోర్టు అభిప్రాయపడింది.ఈ ఆంక్షలను తక్షణమే పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులకు రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలు పొందే హక్కు ఉంది అని కోర్టు పేర్కొంది. భద్రతా ఆంక్షలకు, రవాణా వ్యవస్థను పూర్తిగా మూసివేయడానికి చాలా తేడా ఉందని గుర్తుచేస్తూ, మూసివేసిన మెట్రో స్టేషన్ల సంఖ్యను తగ్గించాలని సూచించింది. ‘ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించలేరు’ అంటూ ప్రభుత్వం అనుసరించిన అతి కఠిన విధానాన్ని కోర్టు తప్పుపట్టింది.ఇదీ చదవండి : దేశ వ్యాప్తంగా పెను సంచలనం! -
ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన కొనసాగింపు...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఙానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలు నేడు కూడా కొనసాగనున్నాయి. ‘ఓట్ చోరీ’ ఆరోపణలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై ప్రతిపక్షాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో.. ఈరోజు (శుక్రవారం) కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇండియా కూటమి ఎంపీలు సిద్ధమయ్యారు. ఙానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగించనున్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ (సంవిధాన్ సదన్)లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశం కానున్నారు. దీంతో సమావేశం అనంతరం తదుపరి నిరసన కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు తెలిపారు.అయితే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు ఇండియా కూటమి ఇప్పటికే సమయం కోరింది. అక్టోబర్ 2న తొలిసారి లేఖ పంపగా, అనంతరం అక్టోబర్ 5న నేతల పేర్లతో మరోసారి అభ్యర్థన పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. అలాగే ఇండియా కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఙానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, SIR అంశంపై తమ తదుపరి కార్యాచరణను నేతలు ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. గురువారం రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంతకుముందు రెండు రోజులుగా జరిగిన ఆందోళనల్లో పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శుక్రవారం జరగనున్న సెంట్రల్ హాల్ సమావేశం, అనంతరం చేపట్టే నిరసన కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్! -
ఢిల్లీలో ట్రెండుకి భిన్నంగా నిరసన
న్యూఢిల్లీలో ‘పితృస్వామ్యం వర్ధిల్లాలి’ అనే నినాదంతో జరిగిన ఓ నిరసన కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పురుషుల హక్కుల కోసం పనిచేస్తున్న ‘ఎన్సీఎం ఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. పురుషులు, మహిళలకు సమానంగా వర్తించే చట్టాలు, పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లను ఈ సంస్థ ముందుకు తెచ్చినట్లు సమాచారం.నిరసనలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ‘‘పితృస్వామ్యం మహిళలు, పిల్లలు, వృద్ధులు, కుటుంబం, సమాజం, దేశాన్ని రక్షిస్తుంది’’ అనే సందేశం కనిపించింది. ఈ నినాదం, బ్యానర్లోని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు కారణమయ్యాయి. నిరసనకు సంబంధించిన ఓ వీడియోలో ఓ మహిళ మాట్లాడిన దృశ్యాలు కూడా వైరల్‌గా మారాయి. సమానత్వం పేరుతో కొందరు మహిళలు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆమె అభిప్రాయపడినట్లు వీడియోలో కనిపించింది. కుటుంబాన్ని రక్షించే బాధ్యత పురుషులదేనని ఆమె పేర్కొంది.ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు తీవ్రంగా విమర్శించగా, మరికొందరు సమానత్వం, కుటుంబ బాధ్యతలు, పురుషుల పాత్రపై చర్చకు దారితీసే అంశంగా దీనిని చూశారు. ఇదే సమయంలో ఢిల్లీలో మహిళల భద్రత, లైంగిక హింసకు వ్యతిరేకంగా మరోవైపు మహిళలు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పితృస్వామ్యం వర్ధిల్లాలి’ అనే నినాదంతో జరిగిన కార్యక్రమం లింగ సమానత్వం, మహిళల స్వేచ్ఛ, పురుషుల హక్కుల అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. View this post on Instagram A post shared by NCMIndia Council For Men Affairs (@ncmindiaa) View this post on Instagram A post shared by Saloni Yadav (@saloniyadavv) -
ఇండి కూటమి మార్చ్.. ఢిల్లీలో హై టెన్పన్
-
నిరసనల్లో చేయి చేసుకున్న అదనపు డీసీపీపై వేటు
న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసన తెలియజేస్తున్న ఓ మహిళపై చేయి చేసుకున్న ఢిల్లీ పోలీసు అదనపు డీసీపీ సందీప్ లాంబాపై వేటు పడింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన ప్రాంతం నుంచి ఆయనను తక్షణమే తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జులై 20వ తేదీన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి భారీగా నిరసనకారులు తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, ఉద్రిక్త పరిస్థితుల నడుమ నూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలో పరుగెత్తుతున్న ఓ మహిళపై అదనపు డీసీపీ సందీప్ లాంబా చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 36 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. నిరసనకారుల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తుల దౌర్జన్యాలను ఉపేక్షించకూడదని, ఆ అధికారిని కోర్టుకు పిలిపించి బాధ్యత వహించేలా చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ మహిళ చేతిలో మేకులు లాంటి వస్తువు ఉందని, ఎంత చెప్పినా అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగిందని, దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతోనే ఆ అధికారి ఆ విధంగా ప్రవర్తించారని ఒక డీసీపీ స్థాయి అధికారి తెలిపారు. మహిళా నిరసనకారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని ఆయనకు సూచించినట్లు పేర్కొన్నారు. మరోవైపు జూలై 20 నాటి ఆందోళనల్లో భారీగా జనం గుమికూడటంతో పోలీసులు లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నిరసనలకు సంబంధించి రాజకీయ నాయకుల నిరసనలు, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. -
చర్చలకు సిద్ధం: సీజేపీ
న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు. అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు. నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్మంతర్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు. -
కాక్రోచ్ పార్టీ చీఫ్ రాకముందే .. భయంతో ఇల్లు ఖాళీ చేసిన పేరెంట్స్!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న ఢిల్లీలో చేపట్టబోయే భారీ ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బోస్టన్‌కు చెందిన ఈ పారిశ్రామికవేత్త, సోషల్ మీడియా సెలబ్రిటీ భారత్‌లో అడుగుపెట్టకముందే పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనకు ముందే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు తమ నివాసాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ ఇంటి వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.భద్రతా కారణాలతోనే ఇల్లు ఖాళీఅభిజీత్ దిప్కే తలపెట్టిన ఢిల్లీ నిరసనపై దేశవ్యాప్తంగా పబ్లిక్ అటెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యగా తమ నివాసాన్ని తాత్కాలికంగా మార్చినట్లు అభిజీత్ తండ్రి భగవాన్‌రావు దిప్కే తెలిపారు. తమకు ఎలాంటి ప్రత్యక్ష బెదిరింపులు రాలేదని, కేవలం కొడుకు సామాజిక ఉద్యమంపై వస్తున్న విపరీతమైన ప్రచారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదట తన కొడుకును ఈ ప్రచారం నుండి తప్పుకోవాలని కోరినప్పటికీ, చివరకు అతని నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.విద్యా సంస్కరణల కోసమే పోరాటంరాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న 30 ఏళ్ల అభిజీత్ దిప్కే, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 6న ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రారంభం కానున్న ఈ నిరసన మార్చ్ పూర్తిగా విద్యా రంగంలో సంస్కరణలు, జవాబుదారీతనం కోసమేనని నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తిగా చట్టబద్ధమైన పద్ధతిలోనే ఈ బహిరంగ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.పార్టీ పెట్టే ఆలోచన లేదు.. లీగల్ సపోర్ట్ సిద్ధంప్రముఖ మానవ హక్కుల న్యాయవాది అసీమ్ సరోదే ఈ కార్యక్రమానికి చట్టపరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఉద్యమాన్ని అధికారిక రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం అభిజీత్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం చట్ట పరిధిలోనే ఈ నిరసన సాగుతుందని తెలిపారు. ఈ ఢిల్లీ ఆందోళనకు మద్దతుగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, నటుడు ప్రకాష్ రాజ్, విశ్లేషకులు విశంభర్ చౌదరి, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే వంటి ప్రముఖులను అభిజీత్ ఆహ్వానించారు. మరోవైపు కొడుకు రాజకీయ యాక్టివిటీపై తల్లి అనిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అతను రాజకీయాల కంటే ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.ఇది కూడా చదవండి: కోటా: ‘నీట్’ సీటు వేటలో అనంత లోకాలకు.. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేటు వద్ద పలువురు నిరసనలు దిగారు. ఈ నిరసనల్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మా ఫొటోలు, ఆయన అనుకూల నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణంగా పలువురిపై ఢిల్లీలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదివారం పలువురు.. ఇండియా గేటు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుకూల వ్యాఖ్యలతో ప్లకార్డులు, ఫొటోలు దర్శనమిచ్చాయి. నిరసనకారులు.. బిర్సా ముండా నుండి మాద్వి హిద్మా వరకు మన అడవులు, పర్యావరణపై పోరాటం కొనసాగింది. మన బిడ్డలను మనమే చంపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాటం కొనసాగుతుంది. రెడ్ సెల్యూట్ టూ హిడ్మా.. అమర్ రహే అంటూ పోస్టర్‌ను ప్రదర్శించి నినాదాలు చేశారు.Protesters against Air Pollution in Delhi suddenly started raising slogans in support of Indian Naxalite Hidma; says "Long live Comrade Hidma"Delhi's air quality hit severe levels Sunday, with AQI around 400, prompting hybrid school classes and health alerts for vulnerable… pic.twitter.com/7cg6aeTRc1— Sujal Singh (@sujalsingh_x) November 23, 2025ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకోగా నిరసనకారులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు పెప్పర్‌స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులు.. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #WATCH | Delhi: A group of protesters holds a protest at India Gate over air pollution in Delhi-NCR. They were later removed from the spot by police personnel pic.twitter.com/DBEZTeET0U— ANI (@ANI) November 23, 2025 -
YSRCP ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు
YSRCP Protest in Delhi Updates సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్సార్సీపీ నిరసన ముగిసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని వైఎస్ జగన్ అన్నారు. ఏపీలో దాడులను ముక్తకంఠంతో ఖండించారని.. సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2024 జాతీయ మీడియాతో వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతపైనే దాడి చేశారుమాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు.. కార్లను ధ్వంసం చేశారుఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. అందుకు తగ్గట్లే దాడుల పర్వం కొనసాగుతోందిప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడుల్ని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందిజాతీయ పార్టీలకు ఆహ్వానం పంపాం.. ఇక్కడికి వచ్చి టీడీపీ ప్రభుత్వ అరాచకాలను చూడాలని(ఎగ్జిబిషన్ గ్యాలరీ) కోరాంరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ కోరాం.. వాళ్లకు ఏపీలో జరుగుతున్న హింసను వివరిస్తాంరాష్ట్రపతి పాలన విధించాలి..ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్య్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్ ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. అందుకే నేను కేంద్రాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.-రాంగోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ (రాజ్యసభ)ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలిఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది. రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. సుప్రీం కోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలి.-ప్రియాంక చతుర్వేది, శివసేన నాయకురాలుఏపీలో పరిస్థితి చూసి షాక్ తిన్నా..నేను బెంగాల్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బాధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌గారికి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము.-నదిముల్‌హక్ (తృణమూల్ కాంగ్రెస్)ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం..న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన పడిన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు.ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌కు అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి. మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాము. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇస్తున్నాను.-తిరుమా వలవన్. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు)వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది?ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా?. ఎన్నికల్లో గెల్చిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా?. వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.-రాజేంద్రపాల్ గౌతమ్. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో ఫోటో గ్యాలరీని ఎఐఎడిఎంకే ఎంపీ (రాజ్యసభ) చంద్రశేఖర్ సందర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజా తీర్పుకు అనుగుణంగా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.అయితే గెల్చిన పార్టీ, ఓడిన పార్టీపై దాడులు చేయడం, వేధించడం సరికాదుఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంత దారుణంగా ఉందిఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అధికారంలోకి వచ్చినా, ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదుఅందుకే ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని.. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు అరికట్టాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నానురాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలు బాగు పడడానికి.. మేము, జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించాముఆ దిశలోనే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది.ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలిపరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిఅత్యాచారాల పైన అందరూ పోరాటం చేయాలిఏపీ తరహాలో తమిళనాడులో దాడులు జరుగుతున్నాయిశాంతిభద్రతలు క్షీణించాయిదాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి:::తంబీ దురై, అన్నా డీఎంకే ఎంపీ ఏపీ మణిపూర్ లాగా మారుతోందిఎవరు వెళ్ళిపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడ్డారుఎవరికైనా అధికారం వస్తుంది పోతుందిప్రతీకార దాడులు, అత్యాచారాలు దారుణంఈ దాడులు చూస్తే బాధ కలుగుతోందివైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::అరవింద్ సావంత్, శివసేన ఎంపీ( ఉద్దవ్ వర్గం)వైఎస్సార్సీపీ పోరాటానికి శివసేన మద్దతువైఎస్ఆర్సీపీ జంతర్ మంతర్ ధర్నాకు మద్దతు పలికిన శివసేన జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్జగన్ పోరాటానికి మద్దతు ప్రకటించిన అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీ ధర్నాకు అన్నాడీఎంకే మద్దతుఏపీ కూటమి పాలనపై వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నాధర్నాకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే పార్టీజగన్ను కలిసిన అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరైఏపీ అరాచకాలను తంబి దొరైకు వివరించిన జగన్ చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదుఏపీలో చట్ట బద్ద పాలన జరగడం లేదుకేంద్ర హోం శాఖ , ఏపీకి స్పెషల్ టీమ్ పంపి ఈ దారుణ దాడులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలిఎవరు అధికారంలో ఉన్నా కార్యకర్తలపై దాడులు సరికాదుఅధికారం రావడం పోవడం సహజంవైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::సంజయ్ రౌత్, ఉద్ధవ్ శివసేన ఎంపీ వైఎస్సార్సీపీ పోరాటానికి ఉద్దవ్ శివనసేన మద్దతుజగన్ కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది సంజయ్‌కు రాష్ట్రంలో గతి తప్పిన లా అండర్ ఆర్డర్ పరిస్థితుల్ని వివరిస్తున్న జగన్ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదువిపక్షాలపై అరాచకాలు మంచి సంప్రదాయం కాదుఅధికారంలో ఉన్నవాళ్లు శాంతియుతంగా ఉండాలిఇవాళ చంద్రబాబు సీఎం.. జగన్ అధికారంలో లేకపోవచ్చు.. కానీ రేపు జగన్ మళ్లీ సీఎం కావొచ్చుఏ పార్టీకైనా కార్యకర్తలే బలంకార్యకర్తల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారుయూపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. బుల్డోజర్ రాజకీయం నడుస్తోందిప్రజాస్వామ్యంలో దాడుల్ని అందరూ ఖండించాలి::: అఖిలేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నిరసనకు సమాజ్ వాదీ పార్టీ సంఘీభావంజగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్అఖిలేష్కు టీడీపీ హింసకు సంబంధించి వీడియోలు చూపించిన జగన్ వైఎస్ఆర్సీపీ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ సంఘీభావంవైఎస్ జగన్ కలిసి సంఘీభావం ప్రకటించిన వాహబ్ ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు : వైఎస్ జగన్ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.లోకేష్ రెడ్‌బుక్ హోర్డింగ్‌లు ఏపీలో పెట్టారు.మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదువందల ఇళ్లను ధ్వంసం చేశారు. గిట్టనవారి పంటలను కూడా ధ్వంసం చేశారు.కూటమి ప్రభుత్వం దాడులతో పాలన సాగిస్తోందిఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్ నిరసనలో జగన్‌తో పాటు పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలుజాతీయ స్థాయిలో ఏపీలో కొనసాగుతున్న అరాచకాల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే నిరసనఏపీ హింసాత్మక ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయిప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు::: వంగ గీతా ఏపీలో విధ్వంస పాలన నడుస్తోందిరాక్షస పాలన సాగుతోంది:::దేవినేని అవినాష్ అమాయకులను తీవ్రంగా కొడుతున్నారువైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారువినుకొండలో రషీద్‌ను నడిరొడ్డు మీద హత్య చేశారు50 రోజుల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి కాబట్టే ధర్నా చేస్తున్నాంఅరాచక పాలనను అరికట్టాలని ఢిల్లీ వేదికగా ధర్నా:::అంబటి ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయినిన్న కూడా వైఎస్సార్సీపీ నేతపై దాడి జరిగిందివైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారుఅసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయిరాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి.. వెయ్యికిపైగా దాడులు జరిగాయిఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందిఏపీలో అరాచకాలను జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకే ధర్నా::: సజ్జలవైఎస్సార్సీపీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారుఏపీ పరిస్థితులు జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే ధర్నా::: ఎమ్మెల్సీ భరత్ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందిరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది::: వరుదు కల్యాణి ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ధర్నాఏపీలో 31 హత్యలు జరిగాయి300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారుఏపీ పరిస్థితులు దేశ ప్రజలకు తెలిసేందుకే ధర్నా:::పుష్పశ్రీవాణి👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు, కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనను.. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గం. వరకు ఈ నిరసన కొనసాగనుంది.👉ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆంక్షలు విధించారు. ఏపీ భవన్ గేట్లు మూసేశారు. జగన్ ధర్నా నేపథ్యంలోనే నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 👉ఏపీలో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. TDP కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా దాడులకు తెగబడుతున్నాయి టీడీపీ శ్రేణులు. 👉 ఢిల్లీ ధర్నాలో టీడీపీ కూటమి ఆటవిక పాలనకు నిదర్శనంగా.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పటివరకు జరిగిన దాడుల తాలుకా ఫొటోలు, వీడియో ఫుటేజీలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనుంది. తద్వారా ప్రభుత్వ ప్రేరేపిత హత్యాకాండను, రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లనుంది.👉 జంతర్ మంతర్‌లో ఈ ఉదయం వైఎస్సార్సీపీ ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి వైఎస్సార్సీపీకి అనుమతి లభించింది. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు అంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గళం విప్పుతూ.. మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. అలాగే.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లనున్నారాయన. 👉టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దాడులు, హత్యలు, హత్యాచారాలు.. హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారం రాకముందు తమ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లు.. అధికారం చేపట్టాక దాడులపై మౌనం వహించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉ఈ నెలన్నర కూటమి పాలనలో.. రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి శాంతి భద్రతలు దిగజారాయి. 👉ఎన్నికల ప్రచారంలో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర కూటమి నేతలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ బహిరంగంగానే ఆ పార్టీల కేడర్లకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు బ్యానర్లు కూడా రాష్ట్రమంతా ఏర్పాటు చేశారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో కూటమి పార్టీల శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండ ఘటనతో.. ఆ హింస తారాస్థాయికి చేరింది. 👉 ఎన్నికల హామీల అమలుకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని జగన్ భావించారు. అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తమై వెంటనే ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ కేడర్‌కు మనోధైర్యం కలిగించడంతో పాటు వినుకొండ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలోనే ఢిల్లీ ధర్నా నిర్ణయాన్ని ప్రకటించారు. 👉ఏపీలో కొనసాగుతున్న ఆటవిక పాలనపై జోక్యం చేసుకోవాలి, గత 50 రోజులుగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ఆయన కేంద్రాన్ని కోరబోతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న వైఎస్సార్సీపీ అధినేత.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రల్ని కలుస్తారు. సహేతుమైన కారణాల్ని వాళ్లకు వివరించి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి ఆయన రాష్ట్రం పరిస్థితి వివరించి.. మద్దతు కోరనున్నారు. 👉టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 👉మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. -
రైతు పోరు: పంజాబ్, హర్యానాల్లో హై అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో పరిసర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న హర్యానా, పంజాబ్‌లు హై అలర్ట్ ప్రకటించాయి. సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీస్‌లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అనూహ్యంగా రైతుల పరేడ్ విజయవంతం కావడంతోపాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో ఢిల్లీలో ఏం జరుగుతోందనే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలోకి వెళ్లే అన్ని రహదారులు, మెట్రోస్టేషన్లు మూసివేశారు. ఈ సందర్భంగా ఢిల్లీకి అదనంగా పారామిలటరీ బలగాలను పెంచారు. ఇంటర్నెట్, మెట్రో సేవలను నిలిపివేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంచారు. రైతుల పరేడ్‌కు కేంద్రంగా నిలిచిన ఎర్రకోట, జమా మసీద్ వద్ద పోలీసులు భద్రత పటిష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు తీసుకున్నారు. కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరించారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ కొనసాగుతోంది. దర్యాప్తు మొదలు రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల దీక్షా శిబిరాల వద్ద భద్రత పెంచారు. అయితే నిన్నటి ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ ఘటనలపై చర్యలు మొదలుపెట్టారు. నిన్న జరిగిన ఘర్షణల్లో 153 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు పోలీసులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. నిన్నటి ఆందోళనలపై మొత్తం 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు గణతంత్ర పరేడ్‌పై స్పెషల్ సెల్ విచారణ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా గ్యాంగ్స్టర్ల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘాజీపూర్మార్కెట్ నుంచి ఢిల్లీ వచ్చే రహదారి మూసివేశారు. ఇది ఇలా ఉండగా రైతుల గణతంత్ర పరేడ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు వేరే శక్తులు కారణమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయని.. రైతులెవరూ అలాంటి పరిణామాలకు అంగీకరించరని.. సహకరించరని గుర్తుచేశారు. తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఢిల్లీ అల్లర్లపై 17 వేల పేజీల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ నెలలో ఏకంగా 17 వేల పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. ముందస్తు కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు చెలరేగాయని, ఈ కేసులో మొత్తం 21 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా, వారిలో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ వారి చేసిన నేరాలు ఏమిటో విఫులంగా వివరిస్తూ ఢిల్లీ పోలీసులు ఈ చార్జీ షీటును దాఖలు చేశారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్ గ్రూప్'పై కేసు ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్ల గురించి ఢిల్లీ పోలీసు విభాగంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మార్చి ఆరవ తేదీన తొలి ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. 59–2020 నెంబర్‌తో నమోదయిన ఈ ఎఫ్ఐఆర్లో జవహర్ లాల్ నెహ్రూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌ను ప్రధాన కుట్రదారుగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24–25 తేదీల్లో ఢిల్లీకి వచ్చినప్పుడు రోడ్లను దిగ్బంధం చేయాల్సిందిగా ప్రజలను రెచ్చ గొడుతూ ఉమర్ ఖలీద్ ప్రసంగించారు. మైనారిటీలను వేధిస్తున్నారంటూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరవు తీయడమే ఖలీద్ లక్ష్యం. ఆయన తన సహచరులతో కలసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళలను, పిల్లలను సమీకరించారు. వారు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా సేకరించి ఇళ్లలో దాచి పెట్టారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: సల్మాన్ ఖుర్షీద్‌కు షాక్..! టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలు ఫిబ్రవరి 23వ తేదీన జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వెలుపల నిందితులు రోడ్డును బ్లాక్ చేశారు. ఆ ప్రాంతం ప్రజలకు ఇక్కట్లు కలిగించడం ద్వారా అల్లర్లకు వారిని సిద్ధం చేయడమే కుట్రలో భాగం. ఖలీద్ సహచరుడిగా ఎఫ్ఐఆర్లో ఈశాన్య ఢిల్లీకి చెందిన డానిష్‌ను పేర్కొన్నారు. వారిద్దరిపై అల్లర్లు, చట్ట విరుద్ధంగా సమావేశమవడం, నేరపూరిత కుట్ర అభియోగాలను ముందుగా మోపిన పోలీసులు, ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, టెర్రరిజమ్ నిరోధక చట్టం కింద అభియోగాలను జోడించారు. ఈ రెండు అభియోగాల కింద నిందితులకు బెయిల్ దొరకడం అసాధ్యం. మార్చి 9వ తేదీన అరెస్టయిన నాలుగు రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటికీ ఆయనపై అదనపు అభియోగాలు నమోదు కానందున బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 13వ తేదీన అరెస్టయిన ఉమర్ ఖలీదుకు అదనపు అభియోగాల కారణంగా ఇప్పటికీ బెయిల్ లభించలేదు. చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు: సుప్రీంకోర్టు వీరితోపాటు ఇదే కేసులో అరెస్ట్ చేసిన మిగతా 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మతిలోని హత్యా, దేశద్రేహం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి 26 సెక్షన్లతోపాటు ఆయుధాల చట్టంలోని రెండు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన స్థానిక నాయకుడు, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన రిసర్చ్ స్కాలర్ సఫూర్ జార్గర్ నిందితుల్లో ఉన్నారు. నిందితుల్లో 80 శాతం మంది మైనారిటీ వర్గానికి చెందిన వారే. -
రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?
► సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం, కార్యదర్శి నారాయణ ► జంతర్‌మంతర్‌లో తమిళ రైతుల ధర్నాకు సంఘీభావం సాక్షి, న్యూఢిల్లీ రైతుల ఆకలి కేకలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రైతుల సమస్యలపై జంతర్‌మంతర్ వద్ద 39 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన దీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ రైతుల అసాధారణ పోరాటానికి సీపీఐ మద్దతు తెలుపుతోందన్నారు. కావేరీ డెల్టాలో మూడేళ్లుగా తీవ్ర కరువు వల్ల 400 మంది చనిపోయారని, ఆకలి చావులు, కరువు చావులు బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక, తక్షణ ఉపశమన చర్యలను చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం, రుణమాఫీ, పంటల నష్టపరిహారం వంటి అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేసినా కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. తిండి, నిద్ర లేకుండా ఢిల్లీ ఎండల్లో మాడుతున్న రైతుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఇకనైనా చొరవ చూపాలని కోరారు. కేంద్రప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని నారాయణ విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రధానమంత్రి వెంటనే వాటిని అమలు చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.


