సెంట్రల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌..! | Police No Permission To Dharna Delhi Lockdown Before CJP Stir | Sakshi
Sakshi News home page

సెంట్రల్ ఢిల్లీలో లాక్‌డౌన్‌..!

Oct 9 2026 5:51 PM | Updated on Oct 9 2026 6:44 PM

Police No Permission To Dharna Delhi Lockdown Before CJP Stir

ఢిల్లీ:  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) రేపు(శనివారం, అక్టోబర్‌ 10వ తేదీ) జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్‌ పరిస్థితి కనిపిస్తుంది. 

ముందుగా అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం.. ఢిల్లీ నలుమూలలా పోలీసులను భారీగా మోహరించింది, అదే సమయంలో ఢిల్లీలో దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని ఇప‍్పటికే పోలీసులు సూచనలు చేస్తున్నారు. మరొకవైపు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను బంద్‌ చేయనున్నారు. ఢిల్లీలో ఈ రోజు అర్థరాత్రి నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ కానున్నాయి. 

ఈరోజు అర్ధరాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్లు గేట్లు మూసివేయనున్నారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో రైల్వే సర్వీసులు బంద్ చేయనున్నారు. 

అవసరమైన మేర మాత్రమే నియంత్రణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రధానమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలో తీసుకుంటున్నారు. హోటల్స్, పీజీ హాస్టల్స్ లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో సెక్షన్ 163 BNS యాక్ట్ అమలు చేయనున్నారు. ఢిల్లీలో ఎలాంటి నిరసనలకు ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసుల మైకులలో ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపటి సీజేపీ ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 

CJP ఆందోళనతో ఢిల్లీలో హైఅలర్ట్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా 23 వేల మంది కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సున్నితమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే శాంతియుత నిరసనలకు జంతర్‌మంతర్‌ కాకుండా మరోచోట అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజా రవాణాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా సుప్రీం ఆదేశించింది. సామన్య ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఒకవైపు ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని పోలీసుల ప్రకటన.. మరొకవైపు సీజేపీ ధర్నాకు పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనబడుతోంది. 

 

 

ఇదీ చదవండి: కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement