ఎర్రకోట పేలుడు కేసు నిందితుడికి సుప్రీం షాక్‌ | Supreme Court bail denied to accused in Red Fort car blast case | Sakshi
Sakshi News home page

ఎర్రకోట పేలుడు కేసు నిందితుడికి సుప్రీం షాక్‌

Nov 23 2026 7:10 PM | Updated on Nov 23 2026 7:22 PM

Supreme Court bail denied to accused in Red Fort car blast case

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో నిందితుడు జాసిర్ బిలాల్ వనీకి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరణ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యూఏపీఏ చట్టం కింద దర్యాప్తు గడువును 90 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది.

2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట ముందు కారు బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ కేసులో నిందితుడిగా ఉన్న జాసిర్ బిలాల్ వనీ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దానిని ధర్మాసనం నిరాకరించింది.

ఇదీ చదవండి: ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement