Delhi protest: ముందస్తుగా 40 మంది.. పోలీసుల అదుపులో.. | Delhi Police Detains 30-40 People Ahead of CJP Protest | Sakshi
Sakshi News home page

Delhi protest: ముందస్తుగా 40 మంది.. పోలీసుల అదుపులో..

Oct 10 2026 7:55 AM | Updated on Oct 10 2026 7:56 AM

Delhi Police Detains 30-40 People Ahead of CJP Protest

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కార్యక్రమానికి ముందు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దేశ రాజధానిలోని మొత్తం 15 జిల్లాల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 నుంచి 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతరులను సమీకరించే లేదా వారిపై ప్రభావం చూపగలరని అనుమానిస్తున్న వ్యక్తుల కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు.

అనుమానిత వ్యక్తుల నివాసాల వెలుపల నిఘాను పెంచినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిరసనకు ముందు భద్రతాపరమైన చర్యలను విస్తృతం చేసినట్లు పేర్కొన్నాయి. రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించాయి. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిరసన సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజేపీ ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఇదీ చదవండి: నిరసనకు ముందే వేధింపులు.. సౌరవ్ దాస్ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement