ప్రజాస్వామ్య హక్కులను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి
ఒక్కరోజే రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి
పండుగల సమయంలో ఢిల్లీ మార్కెట్లు స్తంభించిపోయాయి
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు
మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గత వారం రోజులుగా ఢిల్లీలో నిరసనల పేరిట డ్రామాలాడుతూ దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పారీ్టలు దుర్వినియోగం చేస్తున్నాయని, దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయని మండిపడ్డారు.
మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోల్పోయి ఓడిపోతున్న కాంగ్రెస్ పారీ్ట...తమ ఓటమికి ఎన్నికల కమిష¯న్ను, సుప్రీంకోర్టును బాధ్యులను చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాద్ధాంతం చేశారని, ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా గద్దె దిగాలని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. వేలాది మందితో సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లి సీజేఐపై ఒత్తిడి తీసుకురావడం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదన్నారు.
రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారు..
‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై రాహుల్‌గాంధీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సర్ æసర్వేలో దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మరణించినట్లు తేలింది. చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోతే బోగస్ ఓటింగ్ జరగదా? మరో 6.3 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కోటి మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అసలు ఆచూకీ లేని వ్యక్తుల ఓట్లు 3 కోట్ల వరకూ ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే రెండుచోట్ల పేర్లున్న 9 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించారు.
‘ఒక వ్యక్తికి ఒకే ఓటు‘విధానం రాజ్యాంగబద్ధం కాదా? ప్రతి పోలింగ్ బూత్‌కు కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఉన్నారు. తప్పులుంటే క్షేత్రస్థాయిలో ఆధారాలతో ఎందుకు సరిదిద్దడం లేదు. కేరళం, తమిళనాడులలో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ఎంతో మేలు చేసిందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాలే స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బ్యాలెట్ పేపర్లతో జరిగిన గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, త్రిపుర రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు.
పెట్టుబడులకు గండి
‘విపక్షాల బాధ్యతారాహిత్యం వల్ల ఒక్క రోజే రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలతో ఢిల్లీ మార్కెట్లు స్తంభించిపోయాయి. చిరు వ్యా పారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌గాంధీ బారికేడ్లు ఎక్కి డ్యాన్సులు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నారు. ఓ గర్భిణీ జర్నలిస్టును, మహిళా పోలీసు అధికారులను దురుసుగా నెట్టివేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.
రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు..
రాహుల్‌గాంధీ గజం ఎత్తు ఎగిరితే.. సీఎం రేవంత్‌రెడ్డి తాను రెండు గజాల ఎత్తు ఎగురుతానంటూ ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ధర్నాలకు పిలుపునిస్తే కనీస అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయించే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ మాట్లాడటం హాస్యాస్పదం. వర్షాల్లేక రైతులు, కరెంట్ కోతలతో పరిశ్రమలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వాటిని పట్టించుకోకుండా వారానికోసారి ఢిల్లీకొచ్చి రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తి వెళ్తున్నారు..’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి


