మావోయిస్టు పార్టీ సంచలన లేఖ | Maoist Party Sensational Letter | Sakshi
Sakshi News home page

సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

Dec 5 2025 11:36 AM | Updated on Dec 5 2025 11:51 AM

Maoist Party Sensational Letter

మావోయిస్టు పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. మడావి హిడ్మాని స్పెషల్‌ ఆపరేషన్‌లో పట్టుకోలేదని.. పక్కా సమాచారంతో పట్టుకుని దారుణంగా హత్య చేశారని ఓ లేఖ విడుదల చేసింది. అంతేకాదు.. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. 

హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్‌ కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ ఆపరేషన్‌.  హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పడన్నది అవాస్తవం. అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. వీళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం.  

హిడ్మా హత్యకు కోసాల్‌ అనే వ్యక్తి ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్‌ వ్యాపారి, మరో కాంట్రాక్టర్‌ ఇందుకు కారకులు. అక్టోబర్‌ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారు. 

ఈ హత్యలను కప్పప్పుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లని కట్టు కథలు అల్లారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ ఒట్టి బూటకం. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాం’’ అని వికల్ప్‌ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement