
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. భమ్రాగఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్‌జీ జవాను కూడా మృతి చెందాడు.