
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు చిన్నన్న మృతి
ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురానికి చెందిన మావోయిస్టు సుగులూరి చిన్నన్న (57) మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చిన్నన్నకు భవనాశి శంకర్, విజయ్ అనే మారుపేర్లు ఉన్నాయి.
చిన్నన్న కర్నూలు జిల్లా వేంపెంట ఘటనతోపాటు కరువు దాడులు, సినిమా థియేటర్ల పేల్చివేత, వాహనం దహనం, సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత తదితర ఘటనల్లో నిందితుడిగా రికార్డులకెక్కారు. చిన్నన్న 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. చిన్నన్న అజ్ఞాతంలోకి వెళ్లే నాటికి అతడికి భార్య సరోజ, ఇద్దరు కుమారులు క్రాంతి, రామకృష్ణ ఉన్నారు.